Telugu Global
Cinema & Entertainment

హిట్ హీరోయిన్ కు అన్నీ ఫ్లాపులే

గతేడాది ఫిదా సినిమాతో దుమ్ముదులిపింది సాయిపల్లవి. అదే ఊపులో ఎంసీఏ సినిమాతో మరో హిట్ కూడా కొట్టింది. ఇక సాయిపల్లవికి తిరుగులేదని అనుకున్నారంతా. కట్ చేస్తే ఈ ఏడాది అన్నీ ఫ్లాపులే ఇచ్చింది ఈ బ్యూటీ. 2017లో గోల్డెన్ హ్యాండ్ అనుకున్న ఈ బ్యూటీ.. 2018కి వచ్చేసరికి ఐరెన్ లెగ్ గా మారింది. ఈ ఏడాది సాయిపల్లవి చేసిన కణం సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆమె చేసిన పడి పడి లేచే […]

హిట్ హీరోయిన్ కు అన్నీ ఫ్లాపులే
X

గతేడాది ఫిదా సినిమాతో దుమ్ముదులిపింది సాయిపల్లవి. అదే ఊపులో ఎంసీఏ సినిమాతో మరో హిట్ కూడా కొట్టింది. ఇక సాయిపల్లవికి తిరుగులేదని అనుకున్నారంతా. కట్ చేస్తే ఈ ఏడాది అన్నీ ఫ్లాపులే ఇచ్చింది ఈ బ్యూటీ. 2017లో గోల్డెన్ హ్యాండ్ అనుకున్న ఈ బ్యూటీ.. 2018కి వచ్చేసరికి ఐరెన్ లెగ్ గా మారింది.

ఈ ఏడాది సాయిపల్లవి చేసిన కణం సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆమె చేసిన పడి పడి లేచే మనసు సినిమా కూడా ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాను సాయిపల్లవి మేజిక్ కాపాడలేకపోయింది. ఇదే సినిమాతో పాటు వచ్చిన మారి-2 అనే మూవీ కూడా తెలుగులో ఫ్లాప్ అయింది. ఇలా మూడు ఫ్లాపులతో ఈ ఏడాదిని ముగించింది సాయిపల్లవి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రానా సరసన ఓ సినిమాకు కమిట్ అయింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం పేరిట రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వస్తుంది. ఈ మూవీతో పాటు నాని సరసన మరో సినిమాలో నటించే అవకాశం కూడా ఉంది.

First Published:  28 Dec 2018 10:08 PM GMT
Next Story