Telugu Global
CRIME

మూడో కన్ను మోహరింపు.... రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు....

తెలంగాణ వ్యాప్తంగా నేరాల నిర్మూలనకు ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలను వేగంగా చేధిస్తున్న తెలంగాణ పోలీసులు… ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. 2018 ఏడాది ముగింపు సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన డీజీపీ మహేందర్‌ రెడ్డి…. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడేళ్లలో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్క హైదరాబాద్‌లోనే పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని […]

మూడో కన్ను మోహరింపు.... రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు....
X

తెలంగాణ వ్యాప్తంగా నేరాల నిర్మూలనకు ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలను వేగంగా చేధిస్తున్న తెలంగాణ పోలీసులు… ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.

2018 ఏడాది ముగింపు సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన డీజీపీ మహేందర్‌ రెడ్డి…. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడేళ్లలో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్క హైదరాబాద్‌లోనే పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదు లక్షల సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్టు వివరించారు. ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా వెంటనే గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని మహేందర్‌ రెడ్డి చెప్పారు.

30 రోజుల పాటు సీసీ ఫుటేజ్‌ను స్టోర్ చేస్తామన్నారు. ఈ ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య ఐదు శాతం తగ్గిందని డీజీపీ వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ షీ టీంలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

నేర రహిత తెలంగాణ రాష్ట్రమే తమ లక్ష్యమని చెప్పారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజల సహకారం ఉంటే నేర రహిత తెలంగాణ సాధించడం మరింత సులువు అవుతుందన్నారు డీజీపీ.

First Published:  30 Dec 2018 2:00 AM GMT
Next Story