జెర్సీ ఫస్ట్ లుక్ రెడీ

జెర్సీ… సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రెడీ అయింది. 3 స్టిల్స్ నుంచి ఒక స్టిల్ ను ఫైనల్ చేశారు. ఈ స్టిల్ తో పాటు లోగో డిజైన్ ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పనిమీదే నాని బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్ పూర్తిచేస్తున్నాడు. మొన్ననే ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు నాని. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి కోసం చిన్న విరామం తీసుకున్నాడు. ఫస్ట్ లుక్ కు సంబంధించి ఫొటోను ఫైనల్ చేసిన తర్వాతే కార్తికేయ పెళ్లి కోసం జైపూర్ వెళ్లాడు నాని.
ఈ సినిమాతో బెంగళూరు బ్యూటీ శ్రద్ధ శ్రీనాధ్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. అజ్ఞాతవాసి తర్వాత అనిరుధ్ వర్క్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 19న జెర్సీ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే రొమాంటిక్ ప్రేమకథ ఇది.