Telugu Global
Cinema & Entertainment

"పండుగాడు" గా రాబోతున్న రామ్

పూరీ జగన్నాధ్ అలాగే ఎనర్జేటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే కాస్టింగ్ కాల్ ని కూడా రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అవుతుంది. జనవరి మొదటి వారం లో ఈ సినిమా యొక్క షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది మే లో సినిమాని రిలీజ్ చెయ్యాలి అనే దిశగా పూరి జగన్నాధ్ అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి […]

పండుగాడు గా రాబోతున్న రామ్
X

పూరీ జగన్నాధ్ అలాగే ఎనర్జేటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే కాస్టింగ్ కాల్ ని కూడా రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అవుతుంది. జనవరి మొదటి వారం లో ఈ సినిమా యొక్క షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది మే లో సినిమాని రిలీజ్ చెయ్యాలి అనే దిశగా పూరి జగన్నాధ్ అడుగులు వేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి “పండుగాడు” అనే టైటిల్ ని ఫిక్స్ చేసాడు పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన “పోకిరి” సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు పండుగాడు, ఆ పేరు ఇప్పటికి చాలా ఫేమస్. అందుకే ఇప్పుడు అదే పేరుని సినిమా టైటిల్ గా పెట్టేసాడు పూరి జగన్నాధ్. ఇక ఈ కొత్త చిత్రంలో కూడా రామ్ పాత్ర కూడా రఫ్ గా డిఫరెంట్ లుక్ లో వుండనుందట. అందుకే ఆ పాత్రకు “పండుగాడు” అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు.

First Published:  30 Dec 2018 8:03 AM GMT
Next Story