Telugu Global
NEWS

2018 సీజన్లో కొహ్లీ 2 వేల 735 పరుగులు

మూడు ఫార్మాట్లలోను కొహ్లీ పరుగుల మోత రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో కొహ్లీ 2018 సీజన్ ఆఖరి ఇన్నింగ్స్ లో కొహ్లీ డకౌట్ టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…2018 సీజన్ ను ఘనంగా ముగించాడు. టెస్ట్ క్రికెట్లో 2 వేల 735 పరుగులు సాధించాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 82 పరుగులు సాధించిన కొహ్లీ… రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ కావడంతో….2018 […]

2018 సీజన్లో కొహ్లీ 2 వేల 735 పరుగులు
X
  • మూడు ఫార్మాట్లలోను కొహ్లీ పరుగుల మోత
  • రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో కొహ్లీ
  • 2018 సీజన్ ఆఖరి ఇన్నింగ్స్ లో కొహ్లీ డకౌట్

టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…2018 సీజన్ ను ఘనంగా ముగించాడు. టెస్ట్ క్రికెట్లో 2 వేల 735 పరుగులు సాధించాడు.

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 82 పరుగులు సాధించిన కొహ్లీ… రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ కావడంతో….2018 సీజన్ లో తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడినట్లయ్యింది.

పాంటింగ్ తర్వాతి స్థానంలో కొహ్లీ….

టెస్ట్ క్రికెట్ చరిత్రలో… ఓ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ రికార్డు…ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉంది. 2005 సీజన్లో పాంటింగ్…క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలసి 2వేల 833 పరుగులు సాధించాడు.

2017 సీజన్లో విరాట్ కొహ్లీ 2వేల 818 పరుగులు, 2014 సీజన్లో కుమార సంగక్కర 2 వేల 813 పరుగులు, 2015 సీజన్లో కేన్ విలియమ్స్ సన్ 2 వేల 692 పరుగులు సాధించారు. ప్రస్తుత 2018 సీజన్లో మాత్రం కొహ్లీ మొత్తం మూడుఫార్మాట్లలో కలసి 2వేల 735 పరుగులతో అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

ద్రావిడ్ రికార్డు తెరమరుగు….

గత ఏడాది కాలంలో విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ గా విరాట్ కొహ్లీ నిలిచాడు. బాక్సింగ్ డే టెస్ట్ రెండోరోజు ఆటలో 82 పరుగుల స్కోరు సాధించడం ద్వారా కొహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ఇంతకు ముందు వరకూ విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ రికార్డు… మాజీకెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుతో ఉండేది.

2002 సీజన్లో విదేశీ గడ్డపై ద్రావిడ్‌ 1137 పరుగులు చేశాడు.ఆ తర్వాత దాదాపు 16 సంవత్సరాల విరామం తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేశాడు.

ద్రావిడ్‌ కంటే ముందు 1983లో మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1065 పరుగులు చేయగా.. 1971లో సునీల్ గావస్కర్‌ 918 పరుగులు సాధించారు.

కంగారూల పైనే 1573 పరుగులు….

ఇక టెస్టులో కోహ్లీ వ్యక్తిగతంగా మరో మైలు రాయినీ అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు కంగారూ జట్టు పైనే సాధించడం విశేషం. ఆసీస్‌ జట్టుమీద 1573 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేశాడు.

First Published:  29 Dec 2018 8:01 PM GMT
Next Story