Telugu Global
Cinema & Entertainment

నిర్మాతలని తిట్టేసిన సుమంత్

అక్కినేని హీరో సుమంత్ గత ఏడాది “మళ్ళి రావా” సినిమాతో హిట్ అందుకొని సక్సెస్ రూట్ లోకి వచ్చాడు. అలా సక్సెస్ ఫార్మాట్ కి వచ్చాడు అనుకునే లోపే “సుబ్రమణ్యపురం” అనే సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచినా కూడా లో బడ్జెట్ మూలాన నిర్మాత సేఫ్ అయిపోయాడు. ఇక ఆ తరువాత “ఇదం జగత్” సినిమాని రిలీజ్ చేసాడు సుమంత్. ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు హడావుడిగా రిలీజ్ చేసారు, […]

నిర్మాతలని తిట్టేసిన సుమంత్
X

అక్కినేని హీరో సుమంత్ గత ఏడాది “మళ్ళి రావా” సినిమాతో హిట్ అందుకొని సక్సెస్ రూట్ లోకి వచ్చాడు. అలా సక్సెస్ ఫార్మాట్ కి వచ్చాడు అనుకునే లోపే “సుబ్రమణ్యపురం” అనే సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచినా కూడా లో బడ్జెట్ మూలాన నిర్మాత సేఫ్ అయిపోయాడు. ఇక ఆ తరువాత “ఇదం జగత్” సినిమాని రిలీజ్ చేసాడు సుమంత్.

ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు హడావుడిగా రిలీజ్ చేసారు, అయితే పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేయడంతో ఘోరమైన ఓపెనింగ్స్ “ఇదం జగత్” సినిమాకి వచ్చాయి. అసలు ఈ సినిమా విడుదల అయినట్లు చాలామంది కి తెలియదు.

దాంతో ఓపెనింగ్స్ లేకుండా సుమంత్ కి డిసాస్టర్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇక సినిమా ఎలాగూ విడుదల అయ్యింది కాబట్టి కలెక్షన్లు ఎలా ఉన్నాయి… టాక్ ఎలా ఉంది…. అన్న విషయం కనుక్కున్నాడట సుమంత్. అసలు తన కెరీర్ లో చాలా తక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా “ఇదం జగత్” ఉందట.

అసలు ఇంత దారుణంగా సినిమా ఎలా రిలీజ్ చేసారు అంటూ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసాడట సుమంత్. సినిమా తీయడం ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ డబ్బులు పోసి తీసిన వాళ్ళు పబ్లిసిటీ చేయకుండా ఎలా విడుదల చేసారంటూ నిర్మాతని తిట్టేశాడట సుమంత్.

First Published:  31 Dec 2018 2:58 AM GMT
Next Story