అర్జున్ వచ్చేశాడు.. జెర్సీ ఫస్ట్ లుక్

నాని కొత్త సినిమా జెర్సీ ఫస్ట్ లుక్ రిలీజైంది. న్యూ ఇయర్ కానుకగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగేటప్పుడు  టీమ్ తో ఉన్న సందర్భంలోని  స్టిల్ ని, ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రెగ్యులర్ లుక్ తో కంపేర్ చేస్తే, గెడ్డం తో పాటు, కాస్త పొడవాటి జుట్టు తో ఉన్న నాని, స్టైలిష్ క్రికెటర్ లా కనిపిస్తున్నాడు.
ఈ మూవీ కోసం ప్రత్యేకంగా క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు నాని. రఫ్ లుక్ లోకి కూడా మారాడు. ఫస్ట్ లుక్ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా చేశాడు. “తనకు ఇష్టమైన క్రికెట్ లో తానెంటో ప్రూఫ్ చేసుకోవడానికి తన ఏజ్ కూడా అడ్డురాలేదు. తన కల, తపనతో పాటు  అర్జున్ 36 వ ఏట జరిగిన 1996-97 రంజీ ట్రోఫీ సీజన్ అర్జున్ కి క్రికెట్ పై ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది.” అంటూ స్వయంగా నాని ట్వీట్ చేశాడు.
అంటే.. 1996లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమాగా జెర్సీ తెరకెక్కుతోందనే విషయం నాని ట్వీట్ ద్వారా అర్థమైంది. గౌతమ్ తిన్ననూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. శ్రద్ధాశ్రీనాధ్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది.