Telugu Global
Cinema & Entertainment

మహర్షి నుంచి మరో లుక్

మహర్షి సినిమాలో మహేష్ బాబు 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఆ పుకారుకు మరింత ఊతమిస్తూ ఈరోజు మరో స్టిల్ రిలీజైంది. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో కాస్ట్ లీ సూట్ వేసుకొని, బిజినెస్ మేన్ లుక్ లో ఉన్న మహేష్ స్టిల్ ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. మహర్షి సినిమాకు సంబంధించి కాలేజ్ స్టూడెంట్ గెటప్ లో ఉన్న మహేష్ పోస్టర్ ను, టీజర్ ను ఇప్పటికే […]

మహర్షి నుంచి మరో లుక్
X

మహర్షి సినిమాలో మహేష్ బాబు 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఆ పుకారుకు మరింత ఊతమిస్తూ ఈరోజు మరో స్టిల్ రిలీజైంది. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో కాస్ట్ లీ సూట్ వేసుకొని, బిజినెస్ మేన్ లుక్ లో ఉన్న మహేష్ స్టిల్ ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు.

మహర్షి సినిమాకు సంబంధించి కాలేజ్ స్టూడెంట్ గెటప్ లో ఉన్న మహేష్ పోస్టర్ ను, టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వ్యాపారవేత్త లుక్ లో ఉన్న మహేష్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక ఆ మూడో గెటప్ ను కూడా రిలీజ్ చేస్తే సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్ కు చేరుకుంటాయి. వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వేసవి కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

First Published:  31 Dec 2018 9:50 AM GMT
Next Story