Telugu Global
Cinema & Entertainment

మజిలీ ఫస్ట్ లుక్ రిలీజ్

నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో నాలుగో చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాకు మజిలీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు  టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నాగచైతన్య, సమంత ప్రేమలో మునిగి ఉన్న సన్నివేశాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందనే విషయం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్ట్ లుక్ నుంచి టోటల్ స్టోరీ లైన్, స్క్రీన్ […]

మజిలీ ఫస్ట్ లుక్ రిలీజ్
X
నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో నాలుగో చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాకు మజిలీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నాగచైతన్య, సమంత ప్రేమలో మునిగి ఉన్న సన్నివేశాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందనే విషయం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్ట్ లుక్ నుంచి టోటల్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే వరకు ఈ సినిమా కొత్తగా ఉండబోతోంది. సినిమాలో సగం పార్ట్ చైతూ-సమంత భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. వాళ్ల లుక్స్ కూడా చాలా సింపుల్ గా ఉండేటట్టు, మధ్యతరగతి వ్యక్తుల్ని ప్రతిబింబించేట్టు చూపించారు. మరో అమ్మాయి రాకతో వీళ్లిద్దరి వైవాహిక బంధంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చాయనే కాన్సెప్ట్ తో మజిలీ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా దివ్యాంక నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాడి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో థియేటర్లలోకి రాబోతోంది మజిలీ.
First Published:  30 Dec 2018 8:09 PM GMT
Next Story