Telugu Global
National

ఆ మూడు దీవుల పేర్లు మార్పు!

దేశంలో నగరాల పేరు మార్పు అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అలహాబాద్, సిమ్లా పేర్లను మార్చారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల పేర్లను కూడా మార్చారు. అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నికోబార్ దీవుల్లో మూడు దీవులకు కొత్త పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. ”ద రోస్ ఐలాండ్ దీవి”కి…ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు ”నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్” గా, ”ద నెయిల్ ఐలాండ్” […]

ఆ మూడు దీవుల పేర్లు మార్పు!
X

దేశంలో నగరాల పేరు మార్పు అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అలహాబాద్, సిమ్లా పేర్లను మార్చారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల పేర్లను కూడా మార్చారు. అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నికోబార్ దీవుల్లో మూడు దీవులకు కొత్త పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. ”ద రోస్ ఐలాండ్ దీవి”కి…ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు ”నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్” గా, ”ద నెయిల్ ఐలాండ్” కి ”షాహీద్ ద్వీప్” , ”హావ్ లాక్ ఐలాండ్” కి ”స్వరాజ్ ద్వీప్” గా పేర్లను ప్రకటించారు. అండమాన్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పేర్లను పెట్టారు.

స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్‌ ద్వీప్ లో… తొలిసారి జాతీయ జెండాను ఎగరవేసి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా 75 రూపాయల నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చంద్రబోస్‌ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు.

First Published:  30 Dec 2018 10:07 PM GMT
Next Story