గంటకు 160 కి.మీ వేగంతో ఢీకొన్న కారు… లారీనే బోల్తా.. బీటెక్‌ స్టూడెంట్స్ మృతి

గుంటూరు జిల్లా లాల్‌పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు బీటెక్ విద్యార్థులు చనిపోయారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు అతి వేగంతో ప్రయాణిస్తుండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదానికి గురైన సమయంలో కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు విద్యార్థులున్నారు.

న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్ చేసేందుకు వారు విజయవాడ వస్తున్నారు. గంటకు 160 కి. మీ వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అటుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. కారు వేగం ధాటికి లారీ కూడా ఫల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది.

లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జ అయిపోయింది. సంఘటన స్థలంలోనే నలుగురు విద్యార్థులు చనిపోయారు. ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్పీడో మీటర్‌ ఊడి రోడ్డు మీద పడిపోయింది. విద్యార్థులు ఆర్‌వీఆర్‌ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్నారు.