Telugu Global
International

బంగ్లాదేశ్ క్రికెటర్ కమ్ ఎంపీగా ముషరఫే మొర్తాజా

బంగ్లాదేశ్ పార్లమెంట్ కు ఎన్నికైన క్రికెటర్ ముషరఫే మొర్తాజా ప్రత్యర్థి పై 2 లక్షల 66 వేల ఓట్ల మెజారిటీతో మొర్తాజా విజయం అవామీ లీగ్ తరపున ఎన్నికల బరిలో నిలిచిన మొర్తాజా బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ గా సేవలు అందిస్తున్న మొర్తాజా బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వన్డే కెప్టెన్ ముషరఫే మొర్తాజా…క్రికెటర్ కమ్ పొలిటీషియన్ గా మారాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ పార్టీ తరపున…రికార్డు మెజారిటీతో ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించాడు.  […]

బంగ్లాదేశ్ క్రికెటర్ కమ్ ఎంపీగా ముషరఫే మొర్తాజా
X
  • బంగ్లాదేశ్ పార్లమెంట్ కు ఎన్నికైన క్రికెటర్ ముషరఫే మొర్తాజా
  • ప్రత్యర్థి పై 2 లక్షల 66 వేల ఓట్ల మెజారిటీతో మొర్తాజా విజయం
  • అవామీ లీగ్ తరపున ఎన్నికల బరిలో నిలిచిన మొర్తాజా
  • బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ గా సేవలు అందిస్తున్న మొర్తాజా

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వన్డే కెప్టెన్ ముషరఫే మొర్తాజా…క్రికెటర్ కమ్ పొలిటీషియన్ గా మారాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ పార్టీ తరపున…రికార్డు మెజారిటీతో ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించాడు.

35 ఏళ్ల వెటరన్ మొర్తాజా సరైయిల్ -2 నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచాడు. మొర్తాజాకు 2 లక్షల 74వేల 418 ఓట్లు పోల్ కాగా…ప్రత్యర్థి, జతియా ఓక్యా ఫ్రంట్ అభ్యర్థి ఉజ్ జమాన్ పర్హత్ కు 8వేల 6 ఓట్లు మాత్రమే పోల్ కావడం విశేషం.

రికార్డు మెజారిటీతో గెలుపు….

మొర్తాజా 2 లక్షల 66వేలకు పైగా ఓట్ల మెజారీటీతో ఎన్నికకావడం ద్వారా…ఈ ఘనత సాధించిన బంగ్లా తొలి క్రికెటర్ గా నిలిచాడు. గతంలో…బంగ్లా పార్లమెంట్ కు ఎన్నికైన క్రికెటర్ నైముర్ రెహ్మాన్ మాత్రమే.

క్రికెట్ నుంచి రిటైరైన తర్వాతే నైముర్ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే …మొర్తాజా మాత్రం…బంగ్లాదేశ్ జాతీయ జట్టులో సభ్యుడిగా ఉంటూనే ఎన్నికల్లో పోటీకి దిగి విజేతగా నిలవడం విశేషం.

వన్డే క్రికెట్ కే పరిమితం….

గతంలోనే టెస్ట్ క్రికెట్, టీ-20 క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మొర్తాజా…ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

బంగ్లా ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరపున అత్యధిక మెజారిటీతో ఎంపికైన ఘనత ముషరఫే మొర్తాజాకు మాత్రమే దక్కుతుంది.

First Published:  1 Jan 2019 5:07 AM GMT
Next Story