Telugu Global
National

నా కులాన్ని అభివృద్ధి చేసుకోవడమే నా తక్షణ కర్తవ్యం " మహిళా మంత్రి

రాజస్థాన్‌లో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైంది. ఇంకా కాంగ్రెస్‌ నేతలు విజయాన్ని ఆస్వాదించే పనిలోనే ఉన్నారు. ఇంతలో మహిళా మంత్రి మమతా భూపేష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేబినెట్‌లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె… అల్వార్‌ జిల్లాలోని రేణి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా తన కుల పిచ్చిని బయట పెట్టుకున్నారు మంత్రి. తన ముందున్న తక్షణ కర్తవ్యం తన కులాన్ని అభివృద్ధి చేసుకోవడమేనని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. […]

నా కులాన్ని అభివృద్ధి చేసుకోవడమే నా తక్షణ కర్తవ్యం  మహిళా మంత్రి
X

రాజస్థాన్‌లో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైంది. ఇంకా కాంగ్రెస్‌ నేతలు విజయాన్ని ఆస్వాదించే పనిలోనే ఉన్నారు. ఇంతలో మహిళా మంత్రి మమతా భూపేష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

కేబినెట్‌లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె… అల్వార్‌ జిల్లాలోని రేణి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ సందర్బంగా తన కుల పిచ్చిని బయట పెట్టుకున్నారు మంత్రి. తన ముందున్న తక్షణ కర్తవ్యం తన కులాన్ని అభివృద్ధి చేసుకోవడమేనని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

కులాన్ని అభివృద్ధి చేసిన తర్వాతే మిగిలిన సమాజం గురించి ఆలోచిస్తానని చెప్పారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక కులానికి ప్రతినిధిగా ఉంటానంటున్న మంత్రి మమతా భూపేష్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తోంది.

First Published:  1 Jan 2019 10:30 AM GMT
Next Story