Telugu Global
National

కేసీఆర్‌ కూటమిపై మోడీ వ్యాఖ్యలు

జీఎస్టీని గబ్బర్‌ సింగ్ టాక్స్‌గా రాహుల్ అభివర్ణించడం ఆయన ఆలోచన విధానాన్ని తెలియ జేస్తోందన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే జీఎస్టీని అమలులోకి తెచ్చామన్నారు. జీఎస్టీ రాకముందు దేశంలో 30, 40 శాతం పన్నులుండేవన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారన్నారు. జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు కొద్దిగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనన్నారు. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. జీఎస్టీని మరింత సరళతరం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలే ఉంటే దేశంలో అవినీతి అక్రమాలే […]

కేసీఆర్‌ కూటమిపై మోడీ వ్యాఖ్యలు
X

జీఎస్టీని గబ్బర్‌ సింగ్ టాక్స్‌గా రాహుల్ అభివర్ణించడం ఆయన ఆలోచన విధానాన్ని తెలియ జేస్తోందన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే జీఎస్టీని అమలులోకి తెచ్చామన్నారు. జీఎస్టీ రాకముందు దేశంలో 30, 40 శాతం పన్నులుండేవన్నారు.

జీఎస్టీ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారన్నారు. జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు కొద్దిగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనన్నారు. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. జీఎస్టీని మరింత సరళతరం చేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వాలే ఉంటే దేశంలో అవినీతి అక్రమాలే ఉండేవన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదు కాబట్టి దొంగలు దేశం విడిచి పారిపోతున్నారని.. కానీ వారిని తిరిగి దేశానికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని మోడీ చెప్పారు.

అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన మోడీ… గతంలో 18 శాతానికి వెళ్లిన ద్రవ్యోల్బణాన్ని మూడు శాతానికి తీసుకొచ్చామన్నారు.

రుణమాఫీల ద్వారా రైతుల జీవితాలను మార్చే ప్రయత్నాలు సరైనవేనని మోడీ వ్యాఖ్యానించారు. రైతులను ఆర్ధికంగా పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిని తీసుకువస్తామన్నారు.

కేసీఆర్ కొత్త కూటమి కోసం ప్రయత్నిస్తున్న విషయం తనకు తెలియదన్నారు. కేసీఆర్ కూటమి గురించి తాను ఆలోచించలేదన్నారు. దేశంలో మహాకూటమి ఏర్పాటు మోడీని గద్దె దించేందుకే గానీ… దేశం కోసం కానేకాదన్నారు.

తెలంగాణలో మహాకూటమిని ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కూటమికి, ప్రజలకు మధ్యే పోరాటం ఉంటుందన్నారు. న్యాయప్రక్రియ పూర్తయ్యాకే రామ మందిరంపై ఆర్డినెన్స్ తెస్తామన్నారు.

ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తానంటూ ఆరేడు నెలల క్రితమే ఉర్జిత్ లిఖితపూర్వకంగా కోరారని మోడీ చెప్పారు.

First Published:  1 Jan 2019 10:03 AM GMT
Next Story