Telugu Global
National

విజయమైనా, విఫలమైనా సూర్యోదయానికి ముందే రావాలని చెప్పా " మోడీ

పాకిస్తాన్‌పై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఎంతో ప్రమాదకరమైనదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రాజకీయంగా తనకు ఏమైనా పర్వాలేదు కానీ… సైనికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చానన్నారు. అందుకే సర్జికల్ స్ట్రైక్స్ తేదీలను రెండుసార్లు మార్చినట్టు చెప్పారు. ఆపరేషన్ విజయవంతమైనా, విఫలమైనా సరే సూర్యోదయానికి ముందే తిరిగి రావాల్సిందిగా కమెండోలకు సూచించి పంపించామని మోడీ వెల్లడించారు. సుధీర్ఘ పాలన వల్ల ప్రభుత్వాలపై వ్యతిరేకత వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని మోడీ విశ్లేషించారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని తామెన్నడూ […]

విజయమైనా, విఫలమైనా సూర్యోదయానికి ముందే రావాలని చెప్పా  మోడీ
X

పాకిస్తాన్‌పై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఎంతో ప్రమాదకరమైనదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రాజకీయంగా తనకు ఏమైనా పర్వాలేదు కానీ… సైనికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చానన్నారు. అందుకే సర్జికల్ స్ట్రైక్స్ తేదీలను రెండుసార్లు మార్చినట్టు చెప్పారు.

ఆపరేషన్ విజయవంతమైనా, విఫలమైనా సరే సూర్యోదయానికి ముందే తిరిగి రావాల్సిందిగా కమెండోలకు సూచించి పంపించామని మోడీ వెల్లడించారు. సుధీర్ఘ పాలన వల్ల ప్రభుత్వాలపై వ్యతిరేకత వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని మోడీ విశ్లేషించారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని తామెన్నడూ చెప్పలేదన్నారు.

వారసత్వం, అవినీతి కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతి అని మోడీ విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని అన్నారు. నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసిందని.. అందుకే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మోడీ చెప్పారు. నోట్ల రద్దు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

First Published:  1 Jan 2019 10:17 AM GMT
Next Story