Telugu Global
Cinema & Entertainment

మరో రీమేక్ లో నటించనున్న నాగ చైతన్య

 నాగ చైతన్య తన కెరీర్ లో తొలిసారి మలయాళం సినిమా అయిన “ప్రేమం” ని తెలుగు లో అదే పేరుతో రీమేక్ చేసి డీసెంట్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు కెరీర్ లో రెండో రీమేక్ కి రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా “బరేలి కి బర్ఫీ” అనే సినిమాని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఇక ఈ సినిమా యొక్క తెలుగు రీమేక్ […]

మరో రీమేక్ లో నటించనున్న నాగ చైతన్య
X

నాగ చైతన్య తన కెరీర్ లో తొలిసారి మలయాళం సినిమా అయిన “ప్రేమం” ని తెలుగు లో అదే పేరుతో రీమేక్ చేసి డీసెంట్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు కెరీర్ లో రెండో రీమేక్ కి రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా “బరేలి కి బర్ఫీ” అనే సినిమాని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు నాగ చైతన్య.

ఇక ఈ సినిమా యొక్క తెలుగు రీమేక్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాకటరీ, కోన ఫిలిం కార్పొరేషన్ వాళ్ళు దక్కించుకున్నారు. త్వరలోనే ఈ సినిమాని డైరెక్టర్ ని ఫిక్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేస్తారు అంట టీం. హిందీ లో పూర్తీ స్థాయి కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్టు మార్పులు చేస్తున్నాడు అంట కోన వెంకట్. ప్రస్తుతానికి నాగ చైతన్య “మజిలి” సినిమాలో సమంతా సరసన నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వెంకటేష్ తో నటిస్తున్న “వెంకీ మామ” సినిమా త్వరలో షూటింగ్ ని వెళ్ళనుంది.

First Published:  1 Jan 2019 7:13 AM GMT
Next Story