Telugu Global
National

లోక్‌సభకు ప్రకాశ్‌ రాజ్ పోటీ

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ రాజకీయ ప్రకటన చేశారు. కొత్త ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తన రాజకీయ నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ట్వీట్ చేశారు. ఎక్కడి నుంచి అన్నది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. HAPPY NEW YEAR TO EVERYONE..a new beginning .. more responsibility.. with […]

లోక్‌సభకు ప్రకాశ్‌ రాజ్ పోటీ
X

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ రాజకీయ ప్రకటన చేశారు. కొత్త ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తన రాజకీయ నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ట్వీట్ చేశారు. ఎక్కడి నుంచి అన్నది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రజనీ కాంత్, కమల్ హసన్‌ లు రాజకీయ ప్రకటనలు చేసి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్‌ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు అయింది.

అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రకాశ్‌ రాజ్ విజయం సాధిస్తే అది కీలక ఘట్టమే అవుతుంది. తొలి నుంచి కూడా ప్రధాని మోడీ విధానాలను ప్రకాశ్‌ రాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు ప్రకాశ్‌ రాజ్.

First Published:  1 Jan 2019 12:51 AM GMT
Next Story