Telugu Global
NEWS

టీడీపీ, కాంగ్రెస్.... ఏపీలో కూడా పొత్తు ఖరారైంది!

తెలుగుదేశం పార్టీతో ఏపీలో కూడా తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఖాయమైందని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఇంకా తనచుట్టూ మిగిలిన కొంతమంది కార్యకర్తలకు చెప్పాడు. అధిష్టానం ఓకే చెప్పేసిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు కలిసి పోటీ చేయడం ఖాయమేనని కోట్ల అంటున్నాడట. సీట్ల నంబర్ ను చెప్పలేదు కానీ.. పొత్తు ఉంటుందని మాత్రం కోట్ల చెప్పినట్టుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ – టీడీపీ […]

టీడీపీ, కాంగ్రెస్.... ఏపీలో కూడా పొత్తు ఖరారైంది!
X

తెలుగుదేశం పార్టీతో ఏపీలో కూడా తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం ఖాయమైందని అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఇంకా తనచుట్టూ మిగిలిన కొంతమంది కార్యకర్తలకు చెప్పాడు. అధిష్టానం ఓకే చెప్పేసిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు కలిసి పోటీ చేయడం ఖాయమేనని కోట్ల అంటున్నాడట.

సీట్ల నంబర్ ను చెప్పలేదు కానీ.. పొత్తు ఉంటుందని మాత్రం కోట్ల చెప్పినట్టుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ – టీడీపీ ల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఏపీలో వీరి పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది ప్రశ్నార్థకంగానే నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీల పొత్తు వికటించిన సంగతి తెలిసిందే. మామూలుగా కాదు.. జనాలు ఈ పొత్తును గట్టిగా వ్యతిరేకించారు.

ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు గనుక పెట్టుకోకపోయి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో చాలా బాగుండేది అనే విశ్లేషణలు వినిపించాయి. ఎన్నికల ముందు నుంచే ఆ అభిప్రాయాలు వినిపించాయి. అలా తెలుగుదేశంతో చేతులు కలపడమే తెలంగాణలో కాంగ్రెస్ ను ముంచింది.

ఇక ఏపీలో కూడా వీళ్లు చేతులు కలిపితే అదే పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను టీడీపీ ముంచితే, ఏపీలో టీడీపీని కాంగ్రెస్ ముంచవచ్చు అనే అంచనాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కోట్ల మాట్లాడుతూ…. పొత్తు ఉంటుందని ధ్రువీకరించడం విశేషం.

First Published:  31 Dec 2018 7:30 PM GMT
Next Story