2019 మొదలైంది… ఇక హాట్ హాట్ అప్ డేట్సే!

ఇది ఎన్నికల నామ సంవత్సరం. అటు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. వీటితో పాటు ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా దేశమంతటా ఎన్నికల వేడి పుట్టనుంది. ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకతల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా ముఖ్యమైనవి.

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొంటూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.

ఇటీవలి మూడురాష్ట్రాల్లో ఓటమి ఎదురైనా…. ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల మీద ఉండదని కమలం పార్టీ అంటోంది. మోడీని చూసి మళ్లీ ప్రజలు తమకు అధికారాన్ని అప్పగిస్తారని బీజేపీ విశ్వాసంతో ఉంది.

ఇక ఏపీ విషయానికి వస్తే… చంద్రబాబును గద్దె దింపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయం హాట్ హాట్ గా మారనుంది. మే నెల ఆరంభంతో ఎన్నికల సమరం ముగియనుంది.

ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.ఆ లోపు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో బిజీగా మారనున్నాయి.

టికెట్లు ఎవరికి దక్కుతాయి, అసంతృప్తులు ఊరికే ఉంటారా.. అసహనం వ్యక్తం చేయరా.. అనే అంశాలు అంతలోపు ఆసక్తిని రేపుతాయి. మొత్తానికి రానున్న నాలుగైదు నెలలూ రాజకీయ వినోదానికి అయితే కొదవ ఉండదు!