Telugu Global
NEWS

"మీ అబ్బల సొత్తా?... మీ తాతల సొత్తా?" " ఐఏఎస్ లపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు

నటుడు శివాజీ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేస్తున్న కలెక్టర్లపై విరుచుకుపడ్డారు. విజయవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ కలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిజాయితీపరుడు అంటూ కితాబిస్తూనే కలెక్టర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చుక్కల భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దల కనుసన్నల్లో కుట్రలు జరుగుతున్నాయని చాలా కాలంగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చిన శివాజీ చుక్కల భూములను పేద ప్రజలకు కాకుండా చేస్తున్నది అధికారులేనని ఆరోపించారు. […]

మీ అబ్బల సొత్తా?... మీ తాతల సొత్తా?  ఐఏఎస్ లపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు
X

నటుడు శివాజీ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేస్తున్న కలెక్టర్లపై విరుచుకుపడ్డారు. విజయవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ కలెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిజాయితీపరుడు అంటూ కితాబిస్తూనే కలెక్టర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చుక్కల భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దల కనుసన్నల్లో కుట్రలు జరుగుతున్నాయని చాలా కాలంగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చిన శివాజీ చుక్కల భూములను పేద ప్రజలకు కాకుండా చేస్తున్నది అధికారులేనని ఆరోపించారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదన్నారు.

ఇలా చుక్కల భూములను పేదలనుంచి లాక్కోవడం ద్వారా వాళ్ళను టీడీపీ నుంచి దూరం చేయాలని కలెక్టర్లు ప్రయత్నిస్తున్నారని… ఆ భూములేమైనా కలెక్టర్ల అబ్బలు, తాతల సొత్తా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన నచ్చకపోతే లాంగ్ లీవ్‌ పెట్టి వెళ్లిపోవాలని ఉన్నతాధికారులకు శివాజీ హుకుం జారీ చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే రాజీనామా చేసి వైసీపీలో చేరాల్సిందిగా ఉన్నతాధికారులకు శివాజీ హెచ్చరిక ధోరణిలో చెప్పారు.

ఈ అధికారుల జాబితాను, చంద్రబాబుకు తెలియకుండా ఈ అధికారులు చేస్తున్న వ్యవహారాల తాలూకూ కీలక పత్రాలను చంద్రబాబుకు ఇస్తానన్నారు. ఇంతలో కొందరు విలేకర్లు… ముఖ్యమంత్రి చంద్రబాబుకే తెలియని రహస్యాలు మీకు ఎలా అందాయని ప్రశ్నించగా… మీడియాపైనే శివాజీ ఎదురుదాడి చేశారు. మీరు ఏ పేపర్, ఏ టీవీ ప్రతినిధో చెబితేనే సమాధానం ఇస్తానంటూ ఎదురుదాడి చేశారు. చుక్కల భూములను కాజేస్తున్న విషయం మీ వరకు వచ్చిందంటూ … ఆ విషయాలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటాయా అని ప్రశ్నించగా… చంద్రబాబుకు తెలియవనే తాను భావిస్తున్నానని చెప్పారు.

మొత్తం మీద చుక్కల భూములను స్వాహా చేసే వ్యవహారం టీడీపీ పెద్దల కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపణలు వస్తున్న వేళ… శివాజీ ప్రెస్‌మీట్ పెట్టి కలెక్టర్లు, ఉన్నతాధికారులను పరుష పదజాలంతో తిట్టడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గతంలో జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు కలెక్టర్ చేతిలోకి రిపోర్టును తీసుకునేందుకు జగన్‌ ప్రయత్నించిన సమయంలో ఐఏఎస్ సంఘం ఏకంగా సమావేశం పెట్టి ఖండించింది. మరి ఇప్పుడు శివాజీ ఏకంగా కలెక్టర్ల అబ్బలు… తాతలను కూడా తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఏపీ ఐఏఎస్‌ల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  2 Jan 2019 7:38 AM GMT
Next Story