Telugu Global
NEWS

ఆఖరిటెస్టులో టీమిండియాకు గాయాల దెబ్బ

గాయాలతో ఇశాంత్, అశ్విన్ అవుట్ 13 మంది సభ్యుల తుదిజట్టులో ఉమేశ్, కుల్దీప్ లకు చోటు ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగే ఆఖరి టెస్టులో …విజయమే లక్ష్యంగా టీమిండియా తుదిజట్టును ప్రకటించింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు సిడ్నీ స్టేడియంలో గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. భారత టీమ్ మేనేజ్ మెంట్… 13 మంది సభ్యుల తుదిజట్టులో కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్  లకు చోటు కల్పించింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ గాయంతో మరోసారి […]

ఆఖరిటెస్టులో టీమిండియాకు గాయాల దెబ్బ
X
  • గాయాలతో ఇశాంత్, అశ్విన్ అవుట్
  • 13 మంది సభ్యుల తుదిజట్టులో ఉమేశ్, కుల్దీప్ లకు చోటు

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగే ఆఖరి టెస్టులో …విజయమే లక్ష్యంగా టీమిండియా తుదిజట్టును ప్రకటించింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు సిడ్నీ స్టేడియంలో గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. భారత టీమ్ మేనేజ్ మెంట్… 13 మంది సభ్యుల తుదిజట్టులో కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ లకు చోటు కల్పించింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ గాయంతో మరోసారి అందుబాటులో లేకుండా పోయాడు.

మూడు మార్పులతో టీమిండియా….

టెస్ట్ క్రికెట్ ఐదోర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకోడానికి… విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.

సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా వచ్చే ఐదురోజుల పాటు జరిగే ఈ కీలక సమరం కోసం…. 13 మంది సభ్యుల తుది జట్టును ప్రకటించింది.

అశ్విన్ ఎందుకిలా?

గాయంతో ఇశాంత్ శర్మ, వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోడంతో… భారత టీమ్ మేనేజ్ మెంట్ … తుదిజట్టులో…. స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ,ఉమేశ్ యాదవ్ లకు చోటు కల్పించింది.

అయితే… పూర్తి ఫిట్ నెస్ లేకపోడంతో మరోసారి అశ్విన్ అందుబాటులో లేకుండా పోయాడు.

గతంలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్ ల్లో సైతం అశ్విన్ ఫిట్ నెస్ సమస్యలతోనే కీలక మ్యాచ్ లకు అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుత ఆసీస్ సిరీస్ లో సైతం… అదే సమస్య మరోసారి పునరావృతమయ్యింది.

గోల్డెన్ చాన్స్….

ఇప్పటికే… 2-1తో సిరీస్ పై పట్టు బిగించిన టీమిండియా…సిడ్నీ టెస్టును డ్రాగా ముగించినా లేక మ్యాచ్ నెగ్గినా… కంగారూగడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ నెగ్గిన ఘనత దక్కించుకోగలుగుతుంది.

అందివచ్చిన ఈ బంగారు అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది.

ఇప్పటికే…సిడ్నీ స్టేడియంలో జరిగిన నెట్ ప్రాక్టీస్ లో…కొహ్లీ అండ్ కో పూర్తిస్థాయిలో పాల్గొని కసరత్తులు చేశారు. సిడ్నీ స్టేడియం పిచ్… బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండే అవకాశం ఉండటంతో… టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల వ్యూహంతో పోటీకి దిగే అవకాశం లేకపోలేదు.

పేసర్లు బుమ్రా, షమీలకు తోడుగా స్పిన్నర్ జడేజాతో కలసి అశ్విన్ లేదా..కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లంబూ పేసర్ ఇశాంత్ శర్మ గాయంతో వైదొలగడంతో… ఉమేశ్ యాదవ్ ను చేర్చుకోవాలని కెప్టెన్ కొహ్లీ భావిస్తున్నాడు.

కొహ్లీకి వింత టెన్షన్….

మరోవైపు…కంగారూ గడ్డపై సిరీస్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాలన్న ఆలోచన తనకు ఏమాత్రం లేదని…అయితే…సిడ్నీ టెస్ట్ ఆడే సమయంలో…తన వికెట్ కోసం కంగారూ జట్టులోని 11 మంది ఆటగాళ్లతో పాటు… స్టేడియంలోని 40వేల మంది ఆస్ట్రేలియా అభిమానులు తన వికెట్ కోసం ఎదురుచూస్తున్నారన్న ఆలోచనే తనను ఒత్తిడికి గురిచేస్తోందని ..మీడియా సమావేశంలో కొహ్లీ చెప్పాడు.

ఊరిస్తున్న 12వ విదేశీ విజయం

కెప్టెన్ గా విదేశీ గడ్డపై ఆడిన 24 టెస్టుల్లో ఇప్పటికే 11 విజయాలు సాధించిన విరాట్ కొహ్లీ…12వ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

తుదిఫలితం ఎలా ఉంటుందన్నది తెలుసుకోవాలంటే మాత్రం… వచ్చే ఐదు రోజుల పాటు వేచిచూడక తప్పదు.

First Published:  2 Jan 2019 5:06 AM GMT
Next Story