డీజిల్‌ కంటే తక్కువగా విమాన ఇంధన రేటు

విమాన ప్రయాణం కాస్ట్‌లీ. కానీ విమాన ఇంధనం రేటు మాత్రం పెట్రోల్, డీజిల్‌ కంటే తగ్గిపోయింది. విమాన ఇంధన ధరలను తగ్గిస్తూ తాజాగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో ధరల్లో పెట్రోల్‌, డీజిల్‌దే ఇప్పుడు పైచేయి అయింది.

విమాన ఇంధనం-ఏటీఎఫ్‌ ధరను కిలో లీటర్‌ పై రూ. 9, 990 రూపాయలు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో కిలో లీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ. 58 వేల 60కి తగ్గింది. అంటే లీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ. 58.06 అన్న మాట.

కానీ ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 68. 65గా ఉంది. డిజిల్‌ ధర 62. 66 రూపాయలుగా ఉంది. తాజా ధర తగ్గింపుతో ప్రస్తుతం విమాన ఇంధన ధరలు గడిచిన ఏడాది కాలంలో అత్యంత కనిష్ట స్థాయికి చేరాయి.