Telugu Global
NEWS

నయాసాల్... నయా జోష్

కొత్తసంవత్సరంలో క్రీడాతారల వేడుకలు ఆస్ట్రేలియా ప్రధాని విందులో టీమిండియా సభ్యులు సిడ్నీ వీధుల్లో విరుష్క జోడీ నయాసాల్ కొత్తజంట సైనా-కశ్యప్ కళకళ భారత స్పోర్ట్స్ స్టార్లు, ప్రపంచ క్రీడా దిగ్గజాలు… కొత్త సంవత్సరం వేడుకలను తమ జీవిత భాగస్వాములతో కలిసి వేడుకగా జరుపుకొన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బ్యాడ్మింటన్ నయాజోడీ సైనా-కశ్యప్, ప్రపంచ సాకర్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ సైతం…నూతన సంవత్సర వేడుకలను తమదైన స్టయిల్లో జరుపుకొన్నారు. […]

నయాసాల్... నయా జోష్
X
  • కొత్తసంవత్సరంలో క్రీడాతారల వేడుకలు
  • ఆస్ట్రేలియా ప్రధాని విందులో టీమిండియా సభ్యులు
  • సిడ్నీ వీధుల్లో విరుష్క జోడీ నయాసాల్
  • కొత్తజంట సైనా-కశ్యప్ కళకళ

భారత స్పోర్ట్స్ స్టార్లు, ప్రపంచ క్రీడా దిగ్గజాలు… కొత్త సంవత్సరం వేడుకలను తమ జీవిత భాగస్వాములతో కలిసి వేడుకగా జరుపుకొన్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బ్యాడ్మింటన్ నయాజోడీ సైనా-కశ్యప్, ప్రపంచ సాకర్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ సైతం…నూతన సంవత్సర వేడుకలను తమదైన స్టయిల్లో జరుపుకొన్నారు.

ఆసీస్ ప్రధానితో….

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా క్రికెటర్లు… ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తన నివాసంలో ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, అతని భార్య అనుష్క శర్మల జోడీ సందడి సందడి చేశారు.

మేడ్ ఫర్ ఈచ్ అదర్….

ఆ తర్వాత సిడ్నీ నగర వీధుల్లో… విరుష్క జోడీ స్వేచ్ఛా జీవుల్లా తిరుగుతూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. కొహ్లీ, అనుష్క జోడీ డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు.

సెమీఫార్మల్ సూట్ లో విరాట్ కొహ్లీ, స్లీవ్ లెస్ సిల్వర్ డ్రెస్ లో అనుష్క మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా నిలిచారు.

యువీ-హేజిల్ అదుర్స్….

ముంబై ఇండియన్స్ ఆటగాడు , సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్… తన జీవిత భాగస్వామి హేజిల్ కీచ్ తో కలసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాడు. తమ జంట నయాసాల్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచాడు.

మరోవైపు…కొత్తగా పెళ్లైన బ్యాడ్మింటన్ జంట సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ సైతం కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా జరుపుకొన్నారు.

ఇటు మెస్సీ… అటు రొనాల్డో….

అంతేకాదు…ప్రపంచ సాకర్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ సైతం తమతమ జీవిత భాగస్వాములతో కలిసి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

లయనల్ మెస్సీ ..తన ఇద్దరు పిల్లలతో పాటు భార్య యాంటోనెల్లాతో కలసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నాడు.

ఇక..పోర్చుగీస్ సాకర్ గ్రేట్ క్రిస్టియానో రొనాల్డో సైతం గాళ్ ఫ్రెండ్ జార్జీనా రోడ్రిగేస్, కుమారుడు జూనియర్ రొనాల్డోతో కలసి 2019 సంవత్సరానికి స్వాగతం పలికాడు.

వివిధ క్రీడలకు చెందిన సెలబ్రిటీలు అందరూ….ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమతమ క్రీడాభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు…ఇన్ స్టా గ్రామ్ ద్వారా తమ ఫోటోలను పంచుకున్నారు.

First Published:  1 Jan 2019 6:30 PM GMT
Next Story