Telugu Global
Cinema & Entertainment

సుశ్మిత సేన్ పక్కన సాహో.. సిగ్గుమొగ్గలు

బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జైపూర్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీళ్లలో మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ కూడా ఉంది. పెళ్లికి ఎంతోమంది స్టార్స్ వచ్చినప్పటికీ సుస్మితసేన్ మాత్రం ఏరికోరి ప్రభాస్ తో ఫొటో దిగింది. బాహుబలి ప్రభాస్ తో తను ఫొటో దిగానంటూ సుస్మిత ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో […]

సుశ్మిత సేన్ పక్కన సాహో.. సిగ్గుమొగ్గలు
X
బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జైపూర్ లో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీళ్లలో మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ కూడా ఉంది. పెళ్లికి ఎంతోమంది స్టార్స్ వచ్చినప్పటికీ సుస్మితసేన్ మాత్రం ఏరికోరి ప్రభాస్ తో ఫొటో దిగింది.
బాహుబలి ప్రభాస్ తో తను ఫొటో దిగానంటూ సుస్మిత ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఫొటోలో సుస్మితసేన్ హుందాగా నిల్చుంటే ప్రభాస్ మాత్రం సిగ్గుతో ముడుచుకుపోయాడు. ఇదే వేడుకకు సంబంధించి సుస్మిత సేన్ మరో వీడియో కూడా షేర్ చేసింది.
కార్తికేయ-పూజ పెళ్లికి సంబంధించిన తలంబ్రాల సన్నివేశాన్ని తన ఫోన్ లో షూట్ చేసి ఇనస్టాగ్రామ్ లో పెట్టింది సుస్మిత సేన్. ఆమె ఈ వీడియో పెట్టిన వెంటనే ప్రశ్నల వర్షం మొదలైంది. కార్తికేయ ఎవరు, మీరెందుకు ఆ పెళ్లికి వెళ్లారంటూ అంతా ప్రశ్నించడం మొదలుపెట్టారు. బాలీవుడ్ జనాలకు రాజమౌళి తెలుసు కానీ, కార్తికేయ ఎవరో తెలీదు కదా.
First Published:  2 Jan 2019 4:47 AM GMT
Next Story