Telugu Global
National

ఆ సినిమా ట్రైలర్‌ను తొక్కేశారా?

బయోపిక్‌లు, పుస్తకాల ఆధారంగా వస్తున్న సినిమాలు ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో యాక్సిడెంటల్ ప్రైమ్‌ మినిస్టర్ మూవీ రేపుతున్న రగడ కూడా అంతాఇంతా కాదు. మన్మోహన్‌ సింగ్‌పై ఆయన మీడియా సలహాదారు సంజయ్‌బారు రచించిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ మన్మోహన్ సింగ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దాదాపు 39 మిలియన్ల వ్యూస్ ఈ ట్రైలర్‌కు వచ్చాయి. […]

ఆ సినిమా ట్రైలర్‌ను తొక్కేశారా?
X

బయోపిక్‌లు, పుస్తకాల ఆధారంగా వస్తున్న సినిమాలు ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో యాక్సిడెంటల్ ప్రైమ్‌ మినిస్టర్ మూవీ రేపుతున్న రగడ కూడా అంతాఇంతా కాదు. మన్మోహన్‌ సింగ్‌పై ఆయన మీడియా సలహాదారు సంజయ్‌బారు రచించిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ మన్మోహన్ సింగ్ పాత్రలో నటించారు.

ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దాదాపు 39 మిలియన్ల వ్యూస్ ఈ ట్రైలర్‌కు వచ్చాయి. ఒక దశలో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లింది. అయితే ఏమైందో కానీ హఠాత్తుగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ సెర్చింగ్‌లో వెంటనే దొరకడం లేదు. ఈ చిత్రం ట్రైలర్ కోసం వెతికితే ఈ ట్రైలర్‌పై వచ్చిన చర్చలు, ఇంటర్వ్యూలు, కథనాలు వస్తున్నాయి కానీ… అసలైన ట్రైలర్‌ మాత్రం కనిపించడం లేదు. వెతుకుతూపోతే ఎక్కడో ఆఖరిలో కనిపిస్తోంది.

సినిమా పేరు చివర ఆఫిషియల్ అని టైప్ చేసినప్పుడు మాత్రమే వెంటనే ట్రైలర్ కనిపిస్తోంది. ఇలా జరగడంపై నటుడు అనుపమ్ ఖేర్ అసహనం వ్యక్తం చేశారు. ట్రెండింగ్‌లో ఉన్న ట్రైలర్ ఇప్పుడు ఎందుకు వెంటనే కనిపించడం లేదని యూట్యూబ్ నిర్వాహకులను ప్రశ్నించారు.

ఈ విషయాన్ని యూట్యూబ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌గా ఉన్న ట్రైలర్‌ బుధవారానికి ఎందుకు కనిపించకుండాపోయిందని ప్రశ్నించారు. ఈ చిత్రం ట్రైలర్‌కు ఐదు లక్షల 97వేల మంది లైక్‌ చేయగా… 53వేల మంది డిస్‌లైక్‌ కొట్టారు. దాదాపు 68వేల కామెంట్స్ వచ్చాయి.

First Published:  2 Jan 2019 5:20 AM GMT
Next Story