Telugu Global
National

నో క్యాష్ బోర్డ్... ఎస్‌బీఐ కి కోర్టు ఫైన్

బ్యాంక్ అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయ‌క‌పోతే అద‌న‌పు ఛార్జీల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు చుక్క‌లు చూపించ‌డంలో ప్ర‌భుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్ బీఐ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఇలా అద‌న‌పు ఛార్జీల పేరుతో ఎనిమిదినెల‌ల్లో రూ.41కోట్లు , సంవ‌త్స‌ర కాలంలో రూ.1772 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది. అయితే క‌ష్ట‌మ‌ర్ల అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే అద‌న‌పు ఛార్జీలు ఉంటాయ్. అదే బ్యాంక్ ఏటీఎం ల‌లో మినిమ్ బ్యాలెన్స్ లేక‌పోతే బ్యాంకుల నుండి అద‌న‌పు ఛార్జీ […]

నో క్యాష్ బోర్డ్... ఎస్‌బీఐ కి కోర్టు ఫైన్
X

బ్యాంక్ అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయ‌క‌పోతే అద‌న‌పు ఛార్జీల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు చుక్క‌లు చూపించ‌డంలో ప్ర‌భుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్ బీఐ ముందు వ‌రుస‌లో ఉంటుంది.

ఇలా అద‌న‌పు ఛార్జీల పేరుతో ఎనిమిదినెల‌ల్లో రూ.41కోట్లు , సంవ‌త్స‌ర కాలంలో రూ.1772 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది. అయితే క‌ష్ట‌మ‌ర్ల అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే అద‌న‌పు ఛార్జీలు ఉంటాయ్. అదే బ్యాంక్ ఏటీఎం ల‌లో మినిమ్ బ్యాలెన్స్ లేక‌పోతే బ్యాంకుల నుండి అద‌న‌పు ఛార్జీ వ‌సూలు చేయ‌రా? అంటూ ప‌లువురు ప్ర‌శ్నించారు.

దీంతో క‌ష్ట‌మ‌ర్ల దెబ్బకు దిగివ‌చ్చిన కోర్ట్…. బ్యాంక్ ఏటీఎం ల‌లో మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే స‌ద‌రు బ్యాంక్ ల నుండి అద‌న‌పు రుసుము వ‌సూలు చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

తాజాగా రాయపూర్‌కు చెందిన వినియోగదారుడు న‌గ‌దు డ్రా చేసుకునేందుకు మూడు సార్లు ఏటీంఎం కు వెళ్లినా నోక్యాష్ అని బోర్డ్ త‌గిలించ‌డంతో చిర్రెత్తిపోయి తనకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ కన్జ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేర‌కు విచార‌ణ చేప‌ట్టిన కోర్ట్ స‌ద‌రు బ్యాంక్ డ‌బ్బు నిల్వ చేయ‌నందున రూ.2500 ఫైన్ చెల్లించాల‌ని ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

First Published:  2 Jan 2019 11:56 PM GMT
Next Story