Telugu Global
NEWS

పంచాయితీ ఎన్నికలు.... మిడిల్ ఫింగర్‌కి సిరా చుక్క

‘మిడిల్ ఫింగర్’ చూపించడం పాశ్చాత్య దేశాల్లో ఒక అభ్యంతరకరమైన సంకేతం. మన దేశంలో కూడా ఇటీవల ఈ ధోరణి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే.. రాబోయే తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఓటరు మధ్య వేలుకు సిరా చుక్క పెడతామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి వేలుపై సిరా గుర్తు చూపిస్తూ సెల్ఫీలు దిగారు. వాటిని […]

పంచాయితీ ఎన్నికలు.... మిడిల్ ఫింగర్‌కి సిరా చుక్క
X

‘మిడిల్ ఫింగర్’ చూపించడం పాశ్చాత్య దేశాల్లో ఒక అభ్యంతరకరమైన సంకేతం. మన దేశంలో కూడా ఇటీవల ఈ ధోరణి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే.. రాబోయే తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఓటరు మధ్య వేలుకు సిరా చుక్క పెడతామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి వేలుపై సిరా గుర్తు చూపిస్తూ సెల్ఫీలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. అయితే ఇప్పుడు మధ్య వేలుపై సిరా గుర్తు పెడుతుండటంతో ఈ చర్చ మొదలైంది.

కాగా, మధ్యవేలుపై సిరా గుర్తు ఎందుకనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇంకా నెల కూడా కాలేదు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి వేలుపై ఇప్పటికే సిరా గుర్తు వేశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓటు వేసేది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లే.

అయితే చాలా మందికి సిరా గుర్తు ఇంకా పోలేదు. దాదాపు 90 రోజుల పాటు కొందరి శరీర తత్వాన్ని బట్టి అలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే పంచాయితీ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలుపై సిరా గుర్తు పెట్టనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రిటర్నింగ్, ప్రొసీడింగ్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంపించింది.

First Published:  3 Jan 2019 1:30 AM GMT
Next Story