Telugu Global
National

ఆర్‌బీఐ మరో షాక్.... 2 వేల నోటు ముద్రణ నిలుపుదల

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి దేశ ప్రజలకు షాక్ ఇచ్చిన తర్వాత ఆర్‌బీఐ నుంచి ఏ రోజు ఏ వార్త వినాల్సొస్తుందా అని అందరూ భయభ్రాంతులలో ఉన్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం… ఆ తర్వాత 2 వేల నోటు చలామణిలోకి తీసుకొని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే 2 వేల నోటు వచ్చిన దగ్గరి నుంచి అది రద్దు అవుతుందనే వదంతులు వస్తూనే ఉన్నాయి. నోట్ల రద్దు […]

ఆర్‌బీఐ మరో షాక్.... 2 వేల నోటు ముద్రణ నిలుపుదల
X

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి దేశ ప్రజలకు షాక్ ఇచ్చిన తర్వాత ఆర్‌బీఐ నుంచి ఏ రోజు ఏ వార్త వినాల్సొస్తుందా అని అందరూ భయభ్రాంతులలో ఉన్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం… ఆ తర్వాత 2 వేల నోటు చలామణిలోకి తీసుకొని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే 2 వేల నోటు వచ్చిన దగ్గరి నుంచి అది రద్దు అవుతుందనే వదంతులు వస్తూనే ఉన్నాయి.

నోట్ల రద్దు తర్వాత నగదు చలామణిపై అనేక ఆంక్షలను పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ… నోట్లు రద్దు చేయకపోయినా… ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ పైనే దృష్టి పెట్టడం, ఏటీఎం లలో కూడా తక్కువ నగదునే ఉంచడంతో వినియోగదారులు కూడా ఇబ్బందులు పడ్డారు.

తాజాగా 2 వేల రూపాయల నోటును రద్దు చేయకపోయినా.. ఆర్బీఐ ఆ నోటు ముద్రణ మాత్రం నిలిపి వేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు అయిన 2 వేల రూపాయలను వెంటనే రద్దు చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నోట్ల రద్దుతో బీజేపీ పార్టీపై ఉన్న వ్యతిరేకత…. 2 వేల రూపాయల నోటు రద్దుతో పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

అందుకే 2 వేల రూపాయల నోటును రద్దు చేయకుండా… ఆ నోట్ల ముద్రణను నిలిపి వేసింది. ఇప్పటికే మార్కెట్ నిపుణులు, ఆర్థికవేత్తలు చెప్పే దాన్ని బట్టి నోటును తక్షణమే రద్దు చేయకుండా ముద్రణ నిలిపి వేశారని అభిప్రాయపడుతున్నారు.

2019 ఎన్నికల ఏడాది కాబట్టి.. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకే నోట్ల ముద్రణ నిలిపేసి వారిని ఇబ్బందులు పెట్టదలచుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఇప్పటికే నోట్ల రద్దుతో ప్రాభవం కోల్పోయిన మోడీ మరో సారి రెండు వేల నోట్లను కీలక లోక్‌సభ ఎన్నికల ముందు రద్దు చేయడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

First Published:  3 Jan 2019 6:26 AM GMT
Next Story