Telugu Global
NEWS

తొలి రోజు భారత్‌దే పైచేయి.. స్కోర్ 303/4

ఆస్ట్రేలియా పర్యటనలో ఫుల్ జోష్‌లో దూసుకొని పోతూ ఇప్పటికే టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యతతో ఉన్న భారత జట్టు చివరిదైన నాలుగో టెస్టులో కూడా తొలి రోజు శుభారంభం చేసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా మరో సారి అద్భుత సెంచరీ సాధించడంతో పాటు అరంగేట్రంతోనే ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా […]

తొలి రోజు భారత్‌దే పైచేయి.. స్కోర్ 303/4
X

ఆస్ట్రేలియా పర్యటనలో ఫుల్ జోష్‌లో దూసుకొని పోతూ ఇప్పటికే టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యతతో ఉన్న భారత జట్టు చివరిదైన నాలుగో టెస్టులో కూడా తొలి రోజు శుభారంభం చేసింది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా మరో సారి అద్భుత సెంచరీ సాధించడంతో పాటు అరంగేట్రంతోనే ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది.

అంతకు మునుపు టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీతో కేఎల్ రాహుల్ మరో సారి జట్టు ఓపెనింగ్ ఛాన్స్ అందుకున్నాడు. మయాంక్ అగర్వాల్, లోకేష్ రాహుల్ కలసి తొలి ఇన్నింగ్స్ ఆరంభించినా.. రాహుల్ మరో సారి నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే 9 పరుగులు చేసిన రాహుల్ పెవీలియన్ చేరాడు.

ఆ తర్వాత మయాంక్‌కు పుజారా జత కలిశాడు. వీరిద్దరూ కలసి సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని లయన్ విడదీశాడు.

77 పరుగులు చేసిన మయాంక్.. లయన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కొహ్లీ (23), వైస్ కెప్టెన్ రహానే (18) పరుగులు చేసి అవుటైయ్యారు.

చివరి సెషన్‌లో పుజారాకు ఆంధ్రా బ్యాట్స్‌మాన్ విహారి తోడవడంతో మరో వికెట్ కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. విహారి 39, పుజారా 130 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఇక ఆస్ట్రేలియన్ బౌలర్లలో హాజెల్‌వుడ్ 2 వికెట్లు, స్టార్క్, లయన్ చెరో వికెట్ తీశారు.

First Published:  3 Jan 2019 6:16 AM GMT
Next Story