Telugu Global
Cinema & Entertainment

"ఆర్.ఆర్.ఆర్" లో విద్యా బాలన్ ?

బాలీవుడ్ స్టార్ నటి అయిన విద్యాబాలన్ మొదటిసారిగా తెలుగులో “ఎన్టీఆర్” సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటించింది. బాలక్రిష్ణ ఎన్టీఆర్ గా నటించినీ సినిమా జనవరి 9 న రిలీజ్ కానుంది. క్రిష్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా పాల్గొంటుంది విద్య బాలన్. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలతో పాటు తన మనసులోని కోరికను బయటపెట్టింది. దర్శకధీరుడు రాజమౌళితో కలసి పని […]

ఆర్.ఆర్.ఆర్ లో విద్యా బాలన్ ?
X

బాలీవుడ్ స్టార్ నటి అయిన విద్యాబాలన్ మొదటిసారిగా తెలుగులో “ఎన్టీఆర్” సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటించింది. బాలక్రిష్ణ ఎన్టీఆర్ గా నటించినీ సినిమా జనవరి 9 న రిలీజ్ కానుంది. క్రిష్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగా పాల్గొంటుంది విద్య బాలన్. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలతో పాటు తన మనసులోని కోరికను బయటపెట్టింది. దర్శకధీరుడు రాజమౌళితో కలసి పని చేయాలనీ ఏ నటి, నటుడికైనా ఉంటుంది. విద్యాబాలన్ కూడా రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.

“నేను తెలుగులో నటించిన తొలి చిత్రం “ఎన్టీఆర్’. టాలీవుడ్‌లో నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి సినిమా ఉండదేమో. త్వరలో రాజమౌళి దర్శకత్వంలోనూ పనిచేయాలనుంది” అని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ.

మరి ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి ఆ సినిమాలో విద్య బాలన్ కి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 19 నుంచి కొత్త షెడ్యూల్ లోకి వెళ్తుంది.

First Published:  2 Jan 2019 9:40 PM GMT
Next Story