రాజారెడ్డిగా జగపతిబాబు

మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది యాత్ర సినిమా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది యూనిట్. ఇందులో భాగంగా వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్ర వివరాల్ని బయటపెట్టింది.

యాత్ర సినిమాలో రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడు. ఈ మేరకు జగపతి బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్ర తర్వాత వైఎస్ రాజారెడ్డి పాత్రకు అంత ప్రాధాన్యం ఉందంటోంది యూనిట్.

వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకుడు. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.