Telugu Global
CRIME

బాంబుల్లా పేలుతున్న ఐఫోన్లు

ఐఫోన్ అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సెల్ ఫోన్ ల‌వ‌ర్స్ ఇప్పుడు ఆ ఫోన్ అంటే తెగ క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఐఫోన్ పేలుతున్న‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ఐఫోన్ అంటే జంకుతున్నారు. ఎక్క‌డ త‌మ‌ ఫోన్ పేలుతుందోన‌ని, ఎలాంటి ప్రాణాపాయం పొంచి ఉంటుందోన‌ని జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో టెలికాం రంగంలో వ‌స్తున్న మార్పుల కార‌ణంలో సెల్ ఫోన్ వినియోగ‌దారులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. విప‌రీతంగా సెల్ ఫోన్ ల‌ను వినియోగించ‌డం, […]

బాంబుల్లా పేలుతున్న ఐఫోన్లు
X

ఐఫోన్ అంటే ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సెల్ ఫోన్ ల‌వ‌ర్స్ ఇప్పుడు ఆ ఫోన్ అంటే తెగ క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఐఫోన్ పేలుతున్న‌ట్లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ఐఫోన్ అంటే జంకుతున్నారు. ఎక్క‌డ త‌మ‌ ఫోన్ పేలుతుందోన‌ని, ఎలాంటి ప్రాణాపాయం పొంచి ఉంటుందోన‌ని జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో టెలికాం రంగంలో వ‌స్తున్న మార్పుల కార‌ణంలో సెల్ ఫోన్ వినియోగ‌దారులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. విప‌రీతంగా సెల్ ఫోన్ ల‌ను వినియోగించ‌డం, కొన్ని లోపాల వ‌ల్ల అవి పేల‌డంతో త్రీవంగా గాయ‌ప‌డుతున్నారు. మ‌రికొందరు ప్రాణాల్ని వ‌దిలేస్తున్నారు.

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు చైనా ఫోన్ లే పేలుతాయ‌నుకుంటే తాజాగా వీటి స్థానంలో ఐఫోన్లు వ‌చ్చి చేరుతున్నాయి. గ‌త ఏడాది శాంసంగ్ ఫోన్స్‌ పేలడంతో ఆ కంపెనీ భారీ న‌ష్టాల్ని మూట‌గ‌ట్టుకుంది. ఇప్పుడు ఐఫోన్ కూడా అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంటోంది.

అమెరికాకు చెందిన జె. హిల్ల‌ర్డ్ అనే వ్య‌క్తి ఐఫోన్ ఎక్స్ ఎస్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. ఓ స‌మ‌యంలో ఆఫీస్ క్యాంటిన్ లో భోజ‌నం చేస్తుండ‌గా స‌ద‌రు వ్య‌క్తి జేబులో ఉన్న ఐఫోన్ వేడెక్క‌డంతో తీసి ప‌క్క‌న పెట్టాడు. అలా పెట్టాడో లేదో పెద్ద శ‌బ్ధంతో ఐఫోన్ పేలింది. దీంతో గాయ‌ప‌డ్డ బాధితుడ్ని అత‌డి స్నేహితులు ఆస్ప‌త్రికి తర‌లించారు.

అయితే త‌న సెల్ ఫోన్ పేల‌డంతో కంగుతిన్న హిల్ల‌ర్డ్ ఐఫ‌న్ కంపెనీపై ప‌రువున‌ష్టం దావావేశాడు. త‌న ప్యాంట్ కాలిపోవ‌డమే కాకుండా, సెల్ ఫోన్ కూడా పేలింద‌ని ఆరోపిస్తూ కోర్టు మెట్లు ఎక్కారు. ఫోన్‌ కాలిపోవడంతో తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ ఆపిల్ సంస్థ‌పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

First Published:  2 Jan 2019 11:46 PM GMT
Next Story