Telugu Global
National

ఒకరి మృతి వార్తతో.... హింసాత్మకంగా మారిన కేరళ బంద్

శబరిమల అయ్యప్ప ఆలయంలోనికి మహిళలు ప్రవేశాన్ని నిరసిస్తూ ఇవాళ హిందూ సంస్థలు, బీజేపీ, అయ్యప్ప భక్తుల సంఘం, శబరిమల రక్షణ సమితి సంయుక్తంగా కేరళ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో పూర్తి బంద్ పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో దాదాపు 80 బస్సుల అద్దాలు పగిలిపోయాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తుగా సర్వీసులు నిలిపివేశారు. ఇక కోజికోడ్, కన్నూర్ ప్రాంతాల్లో […]

ఒకరి మృతి వార్తతో.... హింసాత్మకంగా మారిన కేరళ బంద్
X

శబరిమల అయ్యప్ప ఆలయంలోనికి మహిళలు ప్రవేశాన్ని నిరసిస్తూ ఇవాళ హిందూ సంస్థలు, బీజేపీ, అయ్యప్ప భక్తుల సంఘం, శబరిమల రక్షణ సమితి సంయుక్తంగా కేరళ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో పూర్తి బంద్ పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో దాదాపు 80 బస్సుల అద్దాలు పగిలిపోయాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తుగా సర్వీసులు నిలిపివేశారు.

ఇక కోజికోడ్, కన్నూర్ ప్రాంతాల్లో రోడ్లపై టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు దుకాణాలను, సీపీఎం కార్యాలయాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పాలక్కడ్ జిల్లాలోని ఈఎమ్ఎస్ మెమోరియల్ లైబ్రరీ బిల్డింగ్‌కు నిప్పుపెట్టారు. శబరిమల ధార్మిక పరిషత్‌కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు వదంతులు వ్యాపించడంతో పోలీసులు బందోబస్తును మరింత పటిష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో జరిగిన హింసకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ కారణమంటూ సీఎం పినరయ్ విజయన్ ఆరోపించారు. మేం కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని.. కాని కేరళలో శాంతిని నాశనం చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

First Published:  3 Jan 2019 6:14 AM GMT
Next Story