Telugu Global
CRIME

ఒక్క మిస్ కాల్ తో.... రూ.1.86కోట్లు మాయం

అదేంటి మిస్ కాల్ తో రూ.1.86కోట్లు ఎలా మాయ‌మ‌వుతాయి అని అనుకుంటున్నారా..?అవును..! సిమ్ స్వాప్ టెక్నాల‌జీతో హ్యాక‌ర్లు మ‌న అకౌంట్ల‌లో ఉన్న డ‌బ్బును మ‌న‌కు తెలియ‌కుండా వారి బ్యాంక్ ఖాతాల‌కు మ‌ళ్లించుకుంటున్నారు. అలా ముంబైకి చెందిన టెక్స్ టైల్ వ్యాపారి షా అకౌంట్ నుంచి సిమ్ స్వాప్ టెక్నాల‌జీ ఉప‌యోగించి రూ.1.86కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 27న షా కు మిస్డ్‌ కాల్స్ వ‌చ్చాయి. అయితే మరుస‌టి రోజు త‌న ఫోన్ నుంచి మిస్డ్ కాల్స్ కి […]

ఒక్క మిస్ కాల్ తో.... రూ.1.86కోట్లు మాయం
X

అదేంటి మిస్ కాల్ తో రూ.1.86కోట్లు ఎలా మాయ‌మ‌వుతాయి అని అనుకుంటున్నారా..?అవును..! సిమ్ స్వాప్ టెక్నాల‌జీతో హ్యాక‌ర్లు మ‌న అకౌంట్ల‌లో ఉన్న డ‌బ్బును మ‌న‌కు తెలియ‌కుండా వారి బ్యాంక్ ఖాతాల‌కు మ‌ళ్లించుకుంటున్నారు. అలా ముంబైకి చెందిన టెక్స్ టైల్ వ్యాపారి షా అకౌంట్ నుంచి సిమ్ స్వాప్ టెక్నాల‌జీ ఉప‌యోగించి రూ.1.86కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 27న షా కు మిస్డ్‌ కాల్స్ వ‌చ్చాయి. అయితే మరుస‌టి రోజు త‌న ఫోన్ నుంచి మిస్డ్ కాల్స్ కి కాల్ చేద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తే ఫోన్ క‌నెక్ట్ అవ్వ‌లేదు. సిమ్ బ్లాక్ అయ్యింది. దీంతో షాకు అనుమానం వ‌చ్చి స‌ద‌రు నెట్ వ‌ర్క్ సంస్థ‌కు ఫోన్ చేస్తే అస‌లు విషయం తెలిసింది. ఇదంతా హ్యాక‌ర్ల‌ప‌నేన‌ని…. బ్యాంక్ అకౌంట్లు చెక్ చేస్తే రూ.1.86 కోట్లు సిమ్ స్వాప్ టెక్నాల‌జీ తో విదేశాల్లో ఉన్న 14బ్యాంక్ ఖాతాల్లోకి డ‌బ్బులు మ‌ళ్లించిన‌ట్లు తేలింది.

బ్యాంక్ అధికారులు కిందామీదా ప‌డి రూ.20ల‌క్ష‌లు వెన‌క్కి తీసుకోగ‌లిగారు. మిగిలిన మొత్తం కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేయ‌గా…. మ‌నకి అప‌రిచిత వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్స్, మెయిల్స్ వ‌స్తాయ‌ని వాటిని ఓపెన్ చేయ‌డం వ‌ల్ల మ‌న డేటా అంతా ఆ మెయిళ్ల ద్వారా హ్యాక‌ర్ల‌కు చేరుతుంద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు.

అలా షా కూడా గుర్తు తెలియ‌ని మెయిళ్ల‌ను ఓపెన్ చేయ‌డంతో హ్యాక‌ర్లు అత‌ని బ్యాంక్ డీటేల్స్ తో అకౌంట్లో ఉన్న డ‌బ్బును దోచుకున్న‌ట్లు తెలిపారు. కాబ‌ట్టి ప్ర‌తీ ఒక్క‌రు అప‌రిచిత కాల్స్, మెయిల్స్ తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

First Published:  2 Jan 2019 11:52 PM GMT
Next Story