Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసిన "అర్జున్ రెడ్డి" డైరెక్టర్

 ఎన్టీఆర్ ఇటీవలే “అరవింద సమేత” సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి “ఆర్.ఆర్.ఆర్” సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేసింది “అర్జున్ రెడ్డి” చిత్రం అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగులో సంచలనం సృష్టించిన అదే కథతో బాలీవుడ్ లో “కబీర్ సింగ్” గా రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి […]

ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్
X

ఎన్టీఆర్ ఇటీవలే “అరవింద సమేత” సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి “ఆర్.ఆర్.ఆర్” సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేసింది “అర్జున్ రెడ్డి” చిత్రం అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగులో సంచలనం సృష్టించిన అదే కథతో బాలీవుడ్ లో “కబీర్ సింగ్” గా రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి .

అయితే ఆ బాలీవుడ్ సినిమా తరువాత టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో సంచలనాత్మక చిత్రాన్ని చేయాలనే ఆలోచన చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం “అర్జున్ రెడ్డి” రేంజ్ లో ఒక కథ రాసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఇటీవలే ఎన్టీఆర్ ని కలిసిన సందీప్ రెడ్డి వంగాకి కథ కుదిరితే తప్పకుండా కలిసి చేయడమే అని మాట ఇచ్చాడు అంట ఎన్టీఆర్. ఇదిలా ఉంటే మహేష్ బాబు డేట్స్ కూడా సందీప్ రెడ్డి వంగా దగ్గర ఉన్నాయి. మరి ఇద్దరిలో సందీప్ ఎవరితో సినిమా స్టార్ట్ చేస్తాడో చూడాలి.

First Published:  3 Jan 2019 9:05 PM GMT
Next Story