ఎంగేజ్మెంట్ చేసుకున్న అమీ జాక్సన్

ఇండో అమెరికన్ బ్యూటీ అయిన అమీ జాక్సన్ తెలుగు లో “ఎవడు” తమిళ్ లో “ఐ” “2.0” వంటి సినిమాల్లో నటించింది. మంచి క్రేజ్ దక్కించుకుంది. నటన కంటే కూడా అందాల ప్రదర్శన ద్వారే ఈ అమ్మడు ఎక్కువ ఫేమస్ అయ్యింది అలాగే సోషల్ మీడియా లో తనకి సంభందించిన హాట్ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ అందాల భామ తన ఎంగేజ్మెంట్ ని పూర్తీ చేసుకుంది.

ఆమె తన ఎంగేజ్మెంట్ విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ “జనవరి 1న మా ఎంగేజ్మెంట్ జరిగింది. నా బాయ్ ఫ్రెండ్ ని అత్యంత సంతోషంగా ఉంచుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అమీ జాక్సన్. గతకొంత కాలంగా జార్జ్ పనయటో తో డేటింగ్ లో ఉంది అమీ , అయితే ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి ఎప్పడనేది మాత్రం వెల్లడించలేదు ఈ భామ. ప్రస్తుతానికి ఈ భామ చేతిలో ఏ ఒక్క తమిళ్ సినిమా గాని తెలుగు సినిమాగాని లేదు.