Telugu Global
National

అయోధ్య కేసు విచారణ ఎప్పుడో 10న నిర్ణయిస్తాం : సుప్రీంకోర్టు

వివాదాస్పద అయోధ్యలోని రామాలయ స్థలానికి సంబంధించిన కేసు విచారణను ఎప్పుడు చేపట్టాలనే విషయాన్ని జనవరి 10న నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇవాళ సుప్రీం ముందుకు వచ్చిన ఈ కేసుకు సంబంధించి కేవలం 60 సెకెన్ల పాటు మాత్రమే ధర్మాసనం విచారించింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు కట్టిన స్థలం హిందువులకు చెందిందంటూ ఆరు దశాబ్ధాల కింద కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ వివాదం దేశంలో రెండు వర్గాల ఘర్షణకు దారి తీయడమే కాక…. అతిపెద్ద […]

అయోధ్య కేసు విచారణ ఎప్పుడో 10న నిర్ణయిస్తాం : సుప్రీంకోర్టు
X

వివాదాస్పద అయోధ్యలోని రామాలయ స్థలానికి సంబంధించిన కేసు విచారణను ఎప్పుడు చేపట్టాలనే విషయాన్ని జనవరి 10న నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇవాళ సుప్రీం ముందుకు వచ్చిన ఈ కేసుకు సంబంధించి కేవలం 60 సెకెన్ల పాటు మాత్రమే ధర్మాసనం విచారించింది.

అయోధ్యలోని బాబ్రీ మసీదు కట్టిన స్థలం హిందువులకు చెందిందంటూ ఆరు దశాబ్ధాల కింద కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ వివాదం దేశంలో రెండు వర్గాల ఘర్షణకు దారి తీయడమే కాక…. అతిపెద్ద రాజకీయ అంశంగా కూడా మారింది. 16 శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం ఉండేదని హిందుత్వ సంస్థలు వాదిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో సుప్రీం విచారణ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ ఎప్పుడు చేపడతామనే విషయాన్నే 10 తేదీన చెబుతామంటోంది సుప్రీం. విచారణ ఎప్పుడు ముగిస్తుందో చూడాలి.

First Published:  4 Jan 2019 2:29 AM GMT
Next Story