Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ తెరపైకి గీతగోవిందం

టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయిన గీతగోవిందం సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. ఈ మేరకు ఓ బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో సంప్రదింపులు జరిపింది. భారీ మొత్తానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. హిందీలో ఈ సినిమాను ఇషాన్ కట్టర్ రీమేక్ చేయబోతున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన […]

బాలీవుడ్ తెరపైకి గీతగోవిందం
X

టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయిన గీతగోవిందం సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. ఈ మేరకు ఓ బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో సంప్రదింపులు జరిపింది. భారీ మొత్తానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

హిందీలో ఈ సినిమాను ఇషాన్ కట్టర్ రీమేక్ చేయబోతున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన దఢక్ సినిమాతో ఇతడు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో ఇషాన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గీతగోవిందం సినిమాలో గోవింద్ పాత్ర ఇషాన్ కు బాగా నచ్చిందట. వెంటనే నటించడానికి అంగీకరించాడట

త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం గీతాఆర్ట్స్, ఫాక్స్ స్టార్ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగులో పరశురారం డైరక్ట్ చేసిన గీతగోవిందం సినిమా వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన విషయం తెలిసిందే.

First Published:  3 Jan 2019 11:29 PM GMT
Next Story