విజయ్ దేవరకొండ కి ఫ్లాట్ అయిన మరో బాలీవుడ్ భామ

తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ అంటే తనకి చాలా ఇష్టం అయిన, విజయ్ లాగ ఒక్క రోజు అయిన ఉండాలి అని ఉంది అంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ దేవి కూతురు జాహ్నవి ఇటీవలే చెప్పుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ భామ అయిన కైరా అద్వానీ కూడా విజయ్ దేవరకొండ కి ఫ్యాన్ అయిపోయాను అని చెప్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాగా నచ్చేసిందని, విజయ్ దేవరకొండ కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది.

“తను ఒక అద్భుతమైన నటుడు. శాలిని పాండే కూడా చాలా బాగా నటించింది. విజయ్ మరియు శాలిని ఇద్దరు వారి పాత్రల్లో జీవించారు” అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి హిందీలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కైరా అద్వానీ నే కనపడనుంది. ఈ సినిమాలో తాను ఒక పంజాబీ అమ్మాయిగా కనపడనుందని, దర్శకుడు హిందీ నేటివిటీకి సూటయ్యేలా కొన్ని మార్పులు చేశారని ఈ సినిమా న్యూ ఢిల్లీ బాక్ డ్రాప్ తో సాగుతుందని చెప్పింది ఈ హాట్ భామ. ఇక రామ్ చరణ్ తో కైరా కలిసి నటించిన “వినయ విధేయ రామ” జనవరి 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.