మోడ్ర‌న్ పెళ్లి కూతురు ఏం చేసిందంటే..?

పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ …రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు ….రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం …చాలా మంది బంధుమిత్రులు కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు …. ఇది కదా నిజమైన పెళ్లంటే. ఇప్పుడు అదే మ‌హ‌త్త‌ర ఘ‌ట్టాన్ని క‌ల‌క‌లం గుర్తుండేలా డిజైన్ చేస్తున్నారు నేటిత‌రం యువ‌త‌.

అందుకే పెళ్లంటే యువ‌తీ-యువ‌కులు సిగ్గు బిడియం వ‌దిలేసి త‌మ‌కు న‌చ్చిన‌ట్లు, న‌చ్చిన ప‌ద్ద‌తుల్లో ఆ తంతును ముగిస్తున్నారు. తాజాగా మ‌హరాష్ట్ర‌లోని పుణెలో ఓరైతు కుమార్తె కోమ‌ల్ దేశ్ ముఖ్ వివాహం జ‌రిగింది. ఆ వివాహా కార్య‌క్ర‌మం జ‌రిగే పెళ్లి మండ‌పానికి సాధార‌ణంగా కార్ల‌లో, గుర్ర‌పు బుగ్గీల్లో వ‌స్తుంటారు. కానీ కోమ‌ల్ మాత్రం అంద‌రు ముక్కున వేలేసుకునేలా, ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. కూలింగ్ గ్లాస్, పెళ్లి బ‌ట్ట‌ల‌తో బుల్లెట్ డ్రైవ్ చేసుకుంటూ పెళ్లి మండ‌పానికి వ‌చ్చింది. వ‌చ్చే స‌మ‌యంలో ఆమె వెనుక రెండుకార్లు ఫాలో అయ్యాయి.

అయితే ఈ మోడ్ర‌న్ పెళ్లి కూతుర్ని చూసి పెళ్లి చూడటానికి వచ్చిన బంధువులు ముక్కున వేలేసేకున్నారు. బుల్లెట్ మీద దూసుకొచ్చిన పెళ్లికూతుర్ని చూసి అందరూ ఆశ్యర్యపోయినా…. పిల్ల భలే గడుసుదే అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.