Telugu Global
NEWS

ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు సెటైర్!

ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ విడుదలకు రంగం సిద్ధం అవుతూ ఉంది. ఈ సినిమా గురించి భారీ హైప్ ను పెంచుతూ ఉన్నారు. ఎలాగూ బాలయ్యకు మీడియా సహకారం అందిస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలను పెంచడం ఈజీగానే ఉంది. ఇక ఇండస్ట్రీలో ఉండేది ఎక్కువగా భజన జనాలే. కాబట్టి ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేయడానికి వాళ్లంతా చిడతలు పట్టుకుని రెడీగానే ఉన్నారు. Stay Tuned ? Publiée par Naga […]

ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు సెటైర్!
X

ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ విడుదలకు రంగం సిద్ధం అవుతూ ఉంది. ఈ సినిమా గురించి భారీ హైప్ ను పెంచుతూ ఉన్నారు. ఎలాగూ బాలయ్యకు మీడియా సహకారం అందిస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలను పెంచడం ఈజీగానే ఉంది.

ఇక ఇండస్ట్రీలో ఉండేది ఎక్కువగా భజన జనాలే. కాబట్టి ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేయడానికి వాళ్లంతా చిడతలు పట్టుకుని రెడీగానే ఉన్నారు.

Stay Tuned ?

Publiée par Naga Babu sur Jeudi 3 janvier 2019

ఇలాంటి నేపథ్యంలో.. నాగబాబు మాత్రం ఒక సెటైర్ వేశాడు. ఇప్పటికే బాలయ్యను టార్గెట్ గా చేసుకుని నాగబాబు వరసగా ఫేస్ బుక్ పోస్టులు పెడుతూ ఉన్నాడు. ముందుగా బాలయ్య అంటే ఎవరో తెలీదు అని అనడం, ఆ తర్వాత బాలయ్య అంటే కమెడియన్ అనడం.. ఆ తర్వాత దున్నపోతు ఫొటోను పోస్టు చేసి… దాని బ్రీడు, బ్లడ్డు అంటూ పోస్టు పెట్టడం ఇలా బాలయ్య పై నాగబాబు టీజింగ్ కొనసాగుతూ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో.. నాగబాబు నుంచి బాలయ్యపై మరో సెటైర్ పడినట్టుగా ఉంది. ఈ సారి బయోపిక్ విషయంలో ఒక సరదా కవితను పోస్టు చేశాడు నాగబాబు.

కట్టుకథలు కొన్ని, కల్పనలు కొన్ని, చుట్ట నేల, మూట కట్ట నేల, నిజం కక్కలేని బయోపిక్ లు వద్దయా…. విశ్వదాభిరామ, వినరామా…. అంటూ సరదాగా కవితను పోస్టు చేశాడు నాగబాబు. తద్వారా ఎన్టీఆర్ బయోపిక్ మీద సెటైర్ వేశాడు.

అంతే కాదు.. స్టే ట్యూన్డ్ అంటూ మరి కొన్ని ఈ తరహా సెటైర్లు ఉంటాయని నాగబాబు పేర్కొన్నాడు. మొత్తానికి బాలయ్యను లక్ష్యంగా చేసుకుని నాగబాబు పంచ్ ల పరంపర కొనసాగుతూ ఉన్నట్టుంది.

These buffalos and pitbulls are up for sale. They have sustainable breed and bloodline. Plz go through the above websites to buy buffalos and pitbulls. Just for public interest.#HappyNewYear2019

Publiée par Naga Babu sur Mercredi 2 janvier 2019

First Published:  4 Jan 2019 8:24 AM GMT
Next Story