“రామ రావణ రాజ్యం” గా రాజమౌళి సినిమా ?

 రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా అనౌన్స్ అవ్వగానే అందరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా జనవరి 19 నుంచి సెకండ్ షెడ్యూల్ కి వెళ్లనుంది. అయితే ఈ సెకండ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా టైటిల్ ని ప్రకటిస్తాడట. ఇప్పటికే “రామ రావణ రాజ్యం” అనే టైటిల్ ను చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది.

ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఇదిలా ఉంటే ఇంకా హీరోయిన్ ఫిక్స్ కానీ ఈ సినిమా కథ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్, చెర్రీ అన్నదమ్ములుగా ఓ కథనం, ప్రాణ స్నేహితులు అంటూ మరో కథనం, భీకరంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో వీరిద్దరూ మరణించి మళ్ళి జన్మిస్తారని మరో కథనం. ఇలా రకరకాల ఊహాగానాలు ఈ సినిమా కథ పై వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ కథనం ప్రకారం ఈ సినిమా పూర్తి కథ ఇంకా కంప్లీట్ కాలేదు అంట.