Telugu Global
NEWS

హైకోర్టు సంచలన నిర్ణయం... ఎన్‌ఐఏకు జగన్ కేసు అప్పగింత

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు…. కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఇప్పటికే ఎన్‌ఐఏ సుమోటోగా విచారణకు తీసుకోవాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇకపై జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం జోక్యం ఉండకూడదని స్పష్టం చేసింది. జగన్‌పై దాడి కేసులో కుట్రకోణంపై రాష్ట్ర […]

హైకోర్టు సంచలన నిర్ణయం... ఎన్‌ఐఏకు జగన్ కేసు అప్పగింత
X

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు…. కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.

ఈ కేసును ఇప్పటికే ఎన్‌ఐఏ సుమోటోగా విచారణకు తీసుకోవాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇకపై జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం జోక్యం ఉండకూడదని స్పష్టం చేసింది.

జగన్‌పై దాడి కేసులో కుట్రకోణంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కానీ నిజాలు బయటకు రావాలంటే ఎన్‌ఐఏ దర్యాప్తే సరైనదని హైకోర్టు అభిప్రాయపడింది.

విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా, ఆలస్యం అయ్యే కొద్ది సాక్ష్యాలు తారుమారు అయ్యే పరిస్థితి ఉందని పిటిషనర్ తాలూకూ న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దాంతో హైకోర్టు విచారణను వాయిదా వేయకుండా కేసును ఎన్ఐఏకు అప్పగించింది.

First Published:  4 Jan 2019 12:20 AM GMT
Next Story