Telugu Global
NEWS

కౌరవుల పుట్టుక, విష్ణు చక్రంపై ఆంధ్రా వీసీ ఆసక్తికర వ్యాఖ్యలు

రాముడు భార్య సీతమ్మ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అంటూ ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరిగింది. సీత కుండ లాంటి పాత్రలో జన్మించింది కాబట్టి ఆమె టెస్ట్ ట్యూబ్‌ బేబీనే అని ఆయన అప్పట్లో చెప్పారు. ఆంధ్రా వర్శిటీ వీసీ జి. నాగేశ్వరరావు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఆయన కౌరవులను టెస్ట్ ట్యూబ్‌ బేబీలుగా అభివర్ణించారు. జలంధర్‌లో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో […]

కౌరవుల పుట్టుక, విష్ణు చక్రంపై ఆంధ్రా వీసీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

రాముడు భార్య సీతమ్మ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ అంటూ ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరిగింది. సీత కుండ లాంటి పాత్రలో జన్మించింది కాబట్టి ఆమె టెస్ట్ ట్యూబ్‌ బేబీనే అని ఆయన అప్పట్లో చెప్పారు.

ఆంధ్రా వర్శిటీ వీసీ జి. నాగేశ్వరరావు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఆయన కౌరవులను టెస్ట్ ట్యూబ్‌ బేబీలుగా అభివర్ణించారు. జలంధర్‌లో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో మాట్లాడిన ఆయన… వేల ఏళ్ల క్రితం నుంచే భారత్‌కు క్షిపణి పరిజ్ఞానం తెలుసన్నారు.

శ్రీమహావిష్ణువు శత్రువులను చంపేందుకు తన చేతిలోని చక్రాన్ని ప్రయోగించారని… ఆ చక్రం శత్రువులను సంహరించి తిరిగి వెనక్కు వచ్చిందని… దీన్ని బట్టే గైడెడ్ క్షిపణిలు అప్పట్లోనే ఉన్నాయన్న విషయం అర్థమవుతోందన్నారు. విష్ణు చక్రం కూడా ఒక విధమైన క్షిపణియేనని అభిప్రాయపడ్డారు.

గాంధారి పుత్రులైన కౌరవుల పుట్టుకను వివరించారు వీసీ. వంద అండాలను వంద కుండల్లో ఉంచి ఫలదీకరించడం ద్వారా కౌరవులు పుట్టారని…. దీన్ని బట్టి వారంతా టెస్ట్ ట్యూబ్‌ బేబీలు అన్న విషయం తెలుస్తోందన్నారు.

రావణాసురుడు అప్పట్లోనే 24 రకాల విమానాలను కలిగి ఉండేవారని చెప్పారు. వాటిని శ్రీలంకలో ఉంచుకునేవాడని వివరించారు.

First Published:  4 Jan 2019 8:50 PM GMT
Next Story