Telugu Global
NEWS

బాలయ్య గెటప్పులకే గంట అంకితం

ఎన్టీఆర్ బయోపిక్ వస్తుందనే వార్త వచ్చిన వెంటనే బాలయ్య గెటప్స్ కూడా కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి. బాలయ్య ఈ సినిమాలో ఏకంగా 65 గెటప్స్ లో కనిపిస్తారని, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో పాత్రల్లో బాలయ్య కూడా కనిపించనున్నాడని కథనాలు వచ్చాయి. అవి నిజమనే విషయం రీసెంట్ గా వచ్చిన పోస్టర్లతో అర్థమౌతూనే ఉంది. అయితే ఆ గెటప్పులకే సినిమాలో గంట కేటాయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా సెన్సార్ పూర్తయింది. ఏకంగా […]

బాలయ్య గెటప్పులకే గంట అంకితం
X

ఎన్టీఆర్ బయోపిక్ వస్తుందనే వార్త వచ్చిన వెంటనే బాలయ్య గెటప్స్ కూడా కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి. బాలయ్య ఈ సినిమాలో ఏకంగా 65 గెటప్స్ లో కనిపిస్తారని, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో పాత్రల్లో బాలయ్య కూడా కనిపించనున్నాడని కథనాలు వచ్చాయి.

అవి నిజమనే విషయం రీసెంట్ గా వచ్చిన పోస్టర్లతో అర్థమౌతూనే ఉంది. అయితే ఆ గెటప్పులకే సినిమాలో గంట కేటాయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా సెన్సార్ పూర్తయింది. ఏకంగా 2 గంటల 50 నిమిషాలు ఉంది ఈ సినిమా. ఈ సినిమా నిడివి ఇంత పెరగడానికి కేవలం బాలయ్య గెటప్పులే అని తెలుస్తోంది. అటుఇటుగా 3 గంటలున్న ఈ సినిమాలో బాలయ్య గెటప్పులకే గంట కేటాయించారట. నందమూరి అభిమానులకైతే ఇది పండగ చేసుకునే వార్తే. కానీ సామాన్య ప్రేక్షకులు దీన్ని ఎలా అర్థంచేసుకుంటారో చూడాలి.

సెన్సార్ అధికారులు ఈ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చారు. మొదటి భాగంలో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం క్లైమాక్స్ లో రాజకీయ ఎంట్రీకి సంబంధించిన డైలాగ్స్ వస్తాయని సమాచారం.

బాలయ్యతో పాటు రానా, విద్యాబాలన్, సుమంత్, కల్యాణ్ రామ్, రకుల్, ప్రణీత, హన్సిక లాంటి ఎంతోమంది నటీనటులు నటించిన ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  5 Jan 2019 7:00 AM GMT
Next Story