Telugu Global
National

అన్నీ ఎదురుదెబ్బలే.... అందుకే అసహనం!

ఈ మధ్య చంద్రబాబు నాయుడు దేన్ని కెలికినా అది గట్టి షాకే ఇచ్చి వెళ్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసలు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేలు పెట్టకుండా ఉండి ఉంటే…. ఇలాంటి ముప్పులు వచ్చేవి కావేమో. కేసీఆర్ తో సంధి చేసుకుని…. తెలంగాణ రాజకీయం నుంచి చంద్రబాబు వైదొలిగి ఉంటే అదో లెక్క. అయితే…. చంద్రబాబు తన మార్కు మ్యాజిక్ ఏదో చేద్దామని తెలంగాణ […]

అన్నీ ఎదురుదెబ్బలే.... అందుకే అసహనం!
X

ఈ మధ్య చంద్రబాబు నాయుడు దేన్ని కెలికినా అది గట్టి షాకే ఇచ్చి వెళ్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసలు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేలు పెట్టకుండా ఉండి ఉంటే…. ఇలాంటి ముప్పులు వచ్చేవి కావేమో.

కేసీఆర్ తో సంధి చేసుకుని…. తెలంగాణ రాజకీయం నుంచి చంద్రబాబు వైదొలిగి ఉంటే అదో లెక్క.

అయితే…. చంద్రబాబు తన మార్కు మ్యాజిక్ ఏదో చేద్దామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రచ్చలోకి దిగాడు. కాంగ్రెస్ పార్టీని కలుపుకుని వెళ్లాడు. అయితే ఈ రెండు పార్టీలకూ గట్టి ఝలక్ తగిలింది. చంద్రబాబు నాయుడు తన మేనకోడలిని అక్కడ పోటీ చేయించి పరువు పోగొట్టుకున్నాడు. పై పెచ్చూ.. చంద్రబాబు వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడటం చంద్రబాబు నాయుడుకు మామూలు దెబ్బ కాదు. ఇక కాంగ్రెస్ తో పొత్తును కూడా జనాలు హర్షించరని తేలిపోయింది. ఇక తను ఓడినా.. ప్రత్యర్థులు మీద బురద జల్లడానికి చంద్రబాబు ప్రయత్నించాడు. కేసీఆర్ బాబుకు రివర్స్ లో గట్టిగా క్లాస్ పీకాడు.

ఆ మాటలకు బాబు వద్ద సమాధానం లేకపోయింది. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు కానీ…. అది అంతగా పేలలేదు.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు కాకినాడలో బీజేపీకి చెందిన ఒక మహిళ మీద విరుచుకు పడిన తీరు ఆయనలోని అసహనాన్ని చాటుతూ ఉంది. వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని…. అందుకే చంద్రబాబు ఇలా అసహనభరితుడు అవుతున్నాడని పరిశీలకులు అంటున్నారు.

First Published:  5 Jan 2019 2:49 AM GMT
Next Story