టీమిండియా నయావాల్ కు ఇక  బీసీసీఐ A+ కాంట్రాక్టు

  • ఇప్పటి వరకూ ఏ- గ్రేడ్ కాంట్రాక్టులో పూజారా
  • ఆసీస్ సిరీస్ లో రాణించడంతో పూజారాకు ఇక ఏడాదికి 7 కోట్ల కాంట్రాక్టు
  • నాలుగు టెస్టుల్లో 3 సెంచరీలతో 521 పరుగుల పూజారా

టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదటి ఏడు ఇన్నింగ్స్ లో.. మూడు సెంచరీలతో సహా.. 521 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన పూజారా కు …సెంట్రల్ కాంట్రాక్టుల్లో …. ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

 ఇప్పటి వరకూ A- గ్రేడ్ కాంట్రాక్టుతో ఏడాదికి 5 కోట్ల రూపాయలు మాత్రమే అందుకొంటున్న పూజారా…వచ్చే సీజన్ నుంచి A + కాంట్రాక్టుతో 7కోట్ల రూపాయలు అందుకోనున్నాడు.

ప్రస్తుతం A+ కాంట్రాక్టులో కెప్టెన్ కొహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు పూజారా సైతం వచ్చి వీరి సరసన చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ గా మాత్రమే పూజారాకు గుర్తింపు ఉండడంతో…గత మూడు సీజన్లుగా ఐపీఎల్ కు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఐపీఎల్ వేలంలో పూజారా పేరును ఉంచినా…. కాంట్రాక్టు ఇవ్వటానికి…. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోడంతో…. వార్షిక కాంట్రాక్టు మొత్తాన్ని పెంచడం ద్వారా బీసీసీఐ అండగా నిలుస్తూ వస్తోంది.