బన్నీ సరసన మహేష్ బ్యూటీ

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి స్టోరీ లాక్ అయింది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి బాటలోనే ఇది కూడా సెన్సిటివ్ అంశంతో రాబోతోంది. స్టోరీ ఓకే అవ్వడంతో రీసెంట్ గా ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు కూడా. ఇప్పుడు మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ పై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీని సెలక్ట్ చేశారు. తెలుగులో ఈమెకిది మూడో సినిమా. మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు బన్నీ సరసన ఛాన్స్ కొట్టేసింది.

త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ కచ్చితంగా ఉండాల్సిందే. కొత్త సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఉంది. ఆమె ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. జనవరి చివరి వారం నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.