Telugu Global
Cinema & Entertainment

బయోపిక్ భలేగా ఉందట

బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం సెన్సార్ పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్-కథానాయకుడు పేరిట తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పలేదు. ఈ సందర్భంగా బయోపిక్ భలేగా ఉంది అనే టాక్ మాత్రం బయటకు వచ్చింది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది పార్ట్-1. ఈ భాగంలో ఎన్టీఆర్ సినీజీవితానికి సంబంధించిన […]

బయోపిక్ భలేగా ఉందట
X
బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం సెన్సార్ పూర్తిచేసుకుంది. ఎన్టీఆర్-కథానాయకుడు పేరిట తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పలేదు. ఈ సందర్భంగా బయోపిక్ భలేగా ఉంది అనే టాక్ మాత్రం బయటకు వచ్చింది.
సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సంక్రాంతి కానుకగా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది పార్ట్-1. ఈ భాగంలో ఎన్టీఆర్ సినీజీవితానికి సంబంధించిన విశేషాలు మాత్రమే ఉంటాయి. అందుకే సెన్సార్ లో దీనికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవ్వలేదు.
క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాలో బాలయ్యతో పాటు సుమంత్, కల్యాణ్ రామ్, రకుల్ ప్రీత్, షాలిని పాండే, పాయల్ రాజ్ పుత్, హన్సిక, మంజిమ మోహన్, విద్యాబాలన్ కీలకపాత్రలు పోషించారు. ఎన్టీఆర్ పార్ట్-2ను ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు.
First Published:  4 Jan 2019 10:35 PM GMT
Next Story