Telugu Global
Cinema & Entertainment

కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయం

 వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ హీరో. ఈ మేరకు విజయ్ సన్నిహితుల నుంచి లీకులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా పూర్తయిన వెంటనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే […]

కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయం
X
వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ హీరో. ఈ మేరకు విజయ్ సన్నిహితుల నుంచి లీకులు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా పూర్తయిన వెంటనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయ్ దేవరకొండ హిందీ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వస్తుందట.
దేవరకొండను బాలీవుడ్ కు పరిచయం చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అతడితో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చల సారాంశం ఏంటనేది ఇప్పటివరకు బయటకురాలేదు. ఆ చర్చలు సంగతి పక్కనపెడితే, ఈ ఏడాది మాత్రం విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
First Published:  4 Jan 2019 7:22 PM GMT
Next Story